రోజు బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు ఈ ఉండ‌లు తింటే.. బాడీలో కొవ్వంతా క‌రుగుతుంది!

ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో మార్పులు, శ‌రీరానికి శ్ర‌మ లేక‌పోవ‌డం, మ‌ద్యపానం, ఒత్తిడి వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల బాడీలో కొవ్వు పేరుకుపోయి బ‌రువు పెరిగిపోతుంటారు.బ‌రువు పెర‌గ‌డం వ‌ల్ల శ‌రీర ఆకృతి దెబ్బ తిన‌డ‌మే కాదు.

 If You Eat These Before Breakfast, All The Fat In The Body Will Melt! Fat, Body-TeluguStop.com

గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్‌, మ‌ధుమేహం వంటి వ్యాధులు వ‌చ్చే రిస్క్ సైతం రెట్టింపు అవుతుంది.అందుకే బాడీలో కొవ్వును క‌రిగించుకోవ‌డం కోసం నానా పాట్లు ప‌డుతుంటారు.

మీరు ఈ లిస్ట్‌లో ఉన్నారా.? అయితే వ‌ర్రీ వ‌ద్దు.ఇప్పుడు చెప్ప‌బోయే ఉండ‌ల‌ను ప్ర‌తి రోజు బ్రేక్ ఫాస్ట్ కు ముందు తీసుకుంటే మీ బాడీలో కొవ్వంతా క‌రిగిపోవ‌డం ఖాయం.మ‌రి ఇంకెందుకు లేటు ఆ ఉండ‌లు ఏంటో.వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల అవిసె గింజ‌ల‌ను వేసి వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న అవిసె గింజ‌ల‌ను పూర్తిగా చ‌ల్లార‌బెట్టుకుని.

అప్పుడు మిక్సీ జార్‌లో మెత్త‌టి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత రెండు అంగుళాల అల్లం ముక్క‌ను తీసుకుని పీల్ తొల‌గించి నీటిలో శుభ్రంగా క‌డిగి స‌న్న‌గా తురుముకోవాలి.

ఈ తురుము నుంచి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

Telugu Fat, Flax Seeds, Ginger, Tips, Latest, Lemon-Telugu Health Tips

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో అవిసె గింజ‌ల పొడి, అల్లం జ్యూస్‌, రెండు టేబుల్ స్పూన్ల లెమ‌న్ జ్యూస్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మంను చిన్న చిన్న ఉండ‌లుగా చేసుకుని.ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి.

రుచి ఎలా ఉన్నా.ఈ ఉండ‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ముఖ్యంగా అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు.ప్ర‌తి రోజు బ్రేక్ ఫాస్ట్ కు ముందు రెండు చ‌ప్పున ఈ ఉండ‌ల‌ను తీసుకోవాలి.

త‌ద్వారా అందులో ఉండే పోష‌క విలువ‌లు బాడీలో కొవ్వును మొత్తం క‌రిగించి.వెయిట్ లాస్ అయ్యేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube