గణేష్ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి - పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్

గణేష్ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ సూచించారు.ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.

 Police Commissioner Vishnu S Varrier Video Conference On Vinayakachavithi Celebr-TeluguStop.com

ఈనెల 31 నుండి గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టిందని తెలిపారు.

భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్లాలని పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

గణేశ్ నిమజ్జనాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సరిపడా క్రేన్ లను ఏర్పాటు చేయాలన్నారు.అలాగే లైట్లు, అగ్నిప్రమాదo జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

గణేష్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తీసుకొవాలని,అదేవిధంగా నిమజ్జనం చేసే సమయం, నిమజ్జనం మార్గాలపై పూర్తి సమాచారంపై స్దానిక పోలీస్ స్టేషన్ SHOలకు అవగాహన వుండాలని సూచించారు.

గణేష్ విగ్రహాల వద్ద స్టాటిక్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సున్నితమైన ప్రదేశాలలో పికెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్సెస్ విధిగా పెట్రోలింగ్ చేస్తారని తెలిపారు.ఉత్సవాల సందర్భంగా ముఖ్యమైన కార్యక్రమాలు మరియు ప్రత్యేక పూజల సమయంలో అదనపు పోలీస్ బందోబస్తు ఉండేలా చర్యలు తీసుకొవాలని పోలీస్ అధికారులకు సూచించారు.

మండపాలకు వచ్చే జనాలను/వాహనాలను కూడా క్రమపద్ధతిలో వుండేలా సిబ్బంది నియంత్రించాలని, అనుమానిత ట్రబుల్ మోంగర్స్ మరియు ఈవ్ టీజర్‌లపై కూడా నిఘా పెట్టాలని సూచించారు.గణేష్ విగ్రహాల భద్రత మరియు లా&ఆర్డర్ సమస్య లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకొవాలని పోలీస్ అధికారులు సూచించారు.

గణేష్ మండపంలో 24 గంటలు ఒక వాలంటరీ ఉందే విధంగా నిర్వహకులు తగు చర్యలు తీసుకోవాలన్నారు.

TSLPRB, JNTUH ఆధ్వర్యంలో రేపు (ఆదివారం ఆగస్టు 28 తేదీన) జరగనున్న కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్షకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా , పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు.పరీక్ష కేంద్రాల బయట పరిసరాలలో మాత్రమే బందోబస్తు నిర్వహించాలని సూచించారు.144 సెక్షన్ అమల్లో వున్నందున పరిక్ష కేంద్రాల పరిసరాలలోని 500 మీటర్ల పరిధిలో ఏలాంటి ర్యాలీలు , సభలు,సమావేశం నిర్వహించరాదని సూచించారు.

సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్ , పోక్సో , ఎస్సీ ఎస్టీ ,చైల్డ్ కేసులపై పోలీస్ అధికారులు ప్రత్యేక చోరవ తీసుకొని అయ కేసుల్లో పెండింగ్ లేకుండా మరింత పురోగతి సాధించాలని అన్నారు.

ప్రధానంగా కేసుల దర్యాప్తుల్లో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించడం వల్ల నేరస్థులకు సకాలంలో శిక్ష పడి నేరాలుఅదుపులో ఉంటాయని అన్నారు.నేర నిరూపణలో సాంకేతికను సమర్ధవంతంగా వాడుకుంటూ.

నేర నిరూపణకు అవసరమైన భౌతిక సాక్ష్యాలను, అధారలను సేకరించడం, కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సమన్వయం చేసుకుంటూ.సాక్ష్యాలను సకాలంలో న్యాయస్థానంలో ప్రవేశపెట్టి నిందితులకు శిక్ష పడేలా చేయాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube