జూనియర్ పవర్ స్టార్ V/s జూనియర్ సూపర్ స్టార్..ఇద్దరిలో ఎన్ని పోలికలు ఉన్నాయో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్లు గా వెలుగొందిన హీరోలు చాలామంది ఉన్నారు అలాంటి హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు ఆయన చేసిన వైవిధ్యమైన పాత్రలు ఇంకెవరు చేయలేదనే చెప్పొచ్చు ఎందుకంటే ఇండస్ట్రీ కి సంబంధించిన ఏ ఒక్క కొత్త టెక్నాలజీ వచ్చిన అప్పట్లో కృష్ణ మాత్రమే చేసేవారు నష్టం వస్తుందని తెలిసినా తన డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలతో చాలా ప్రయోగాలు చేశారు.తెలుగులో ఆయన చేసిన ఫస్ట్ కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు సన్సేషనల్ హిట్ గా నిలిచి ఇండస్ట్రీలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది అప్పటి నుంచి కౌబాయ్ సినిమాలు రావడం స్టార్ట్ అయ్యాయి.

 Similarities Between Akira Nandan And Gautam Krishna-TeluguStop.com

కెరీర్లో చాలా హిట్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో హీరోగా చేసిన కృష్ణ తన నట వారసుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు ని పరిచయం చేశారు.అనతికాలంలోనే మహేష్ బాబు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు యాక్టింగ్ లోనూ అందంలోనూ కృష్ణ గారిని మించిపోయాడు అనే చెప్పాలి.

అయితే మహేష్ బాబు నమ్రత లు 2005లో పెళ్లి చేసుకోగా వారికి 2006లో గౌతమ్ కృష్ణ జన్మించాడు.ప్రస్తుతానికి గౌతమ్ టీనేజ్లో ఉన్నాడు.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ ఇప్పుడు యాక్టింగ్ కు సంబంధించిన మేలుకువలు నేర్చుకున్నాడు అని చెప్పాలి.అయితే నమ్రత కూడా నటి కావడం వల్ల అటు తండ్రి నుంచి వచ్చే నటననీ తల్లి నుంచి వచ్చే నటన ప్రతిభని కూడగట్టుకొని తను కూడా ఇండస్ట్రీలో మెయిన్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు.

ఇప్పటికే లాక్ డౌన్ లో మహేష్ బాబు, గౌతమ్ ఇద్దరూ కొన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.

Telugu Akira Nandan, Gauthamkrishna, Mahesh Babu, Mahesh Babu Son, Pawan Kalyan,

సూపర్ స్టార్ కృష్ణ లాగే ఇండస్ట్రీలోకి తన స్వయంకృషితో వచ్చి హీరోగా మారి అనతికాలంలోనే మెగాస్టార్ అయిన హీరో చిరంజీవి.ఇండస్ట్రీలో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి.గ్యాంగ్ లీడర్, జగదేకవీరుడు అతిలోకసుందరి, ఖైదీ అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, ఘరానా మొగుడు, ఠాగూర్, ఇంద్ర లాంటి వరుస హిట్లతో బాక్స్ ఆఫీస్ మీద తన పంజా విసిరిన మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు.

మొదటి సినిమా అనుకున్నంత అడకపోయినప్పటికీ తర్వాత వచ్చిన గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలతో మంచి హిట్ అందుకున్నాడు ఆ తర్వాత కొత్త దర్శకుడైన కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన తొలి ప్రేమ సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ అందుకొని పవర్ స్టార్ అనిపించుకున్నాడు.ఆ తర్వాత ఖుషి సినిమాతో మెగా స్టార్ కి ఏ మాత్రం తగ్గని పవర్ స్టార్ అనిపించుకున్నాడు.

అయితే బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రేణు దేశాయ్ నీ పెళ్లి చేసుకున్నాడు ఆమెకి అఖిరానందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అఖిరా నందన్ కి ప్రస్తుతం 17 సంవత్సరాలు కాగా త్వరలోనే సోలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఇప్పటికే మరాఠీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన అఖిరా నందన్ యాక్టింగ్ పరంగా మంచి పేరు తెచ్చుకున్నాడు… అఖిరా నందన్ ప్రస్తుతం అడవి శేషు మెయిన్ రోల్ చేస్తున్న మేజర్ సినిమా లో ఒక క్యారెక్టర్ చేస్తున్నాడు.అయితే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ లా కొడుకు అయిన అఖిరా నందన్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోల వెలిగిపోతాడు అని మెగా ఫ్యామిలీ తో పాటు ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు అఖిరా నందన్ సోలో హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూద్దాం…

Telugu Akira Nandan, Gauthamkrishna, Mahesh Babu, Mahesh Babu Son, Pawan Kalyan,

ప్రస్తుతం ఇండస్ట్రీలో మహేష్ బాబు నమ్రత ల తనయుడు అయినా గౌతం కృష్ణ కి పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తనయుడు అయిన అకిరా నందన్ కి మధ్య స్నేహపూర్వకమైన పోటీ ఉందని చెప్పాలి ఎందుకంటే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చే గౌతం కృష్ణ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే పవర్ స్టార్ కొడుకు గా ఎంట్రీ ఇచ్చే అకీరానందన్ కి మధ్య ఎందుకు పోటీ ఉందంటే అటు సూపర్ స్టార్ ఫ్యామిలీని, ఇటు మెగాస్టార్ ఫ్యామిలీ ని ముందుకు తీసుకెళ్లే నెక్స్ట్ జనరేషన్ వారసులు వీళ్లే కాబట్టి అయితే గౌతం తల్లిదండ్రులు, అఖిరా నందన్ తల్లిదండ్రులు నటులు కావడం వల్ల స్వతహాగా యాక్టింగ్ అనేది వీళ్ళ జీన్స్ లోనే ఉంటుంది కాబట్టి ఎవరు తన నటనతో ఆకట్టుకుంటారు అని ఉత్సాహంతో యావత్ తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం ఎదురు చూస్తూ ఉంది మరి వీరిద్దరూ ఎప్పుడు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తారో, ఇచ్చిన వాళ్ల నాన్నల లాగా సూపర్ స్టార్ గౌతం పవర్ స్టార్ అకిరా నందన్ అని అనిపించుకుంటారో లేదో వెయిట్ చేసి చూడాల్సిందే….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube