థైఫ్యాట్ (తొడ కొవ్వు) ను తగ్గించుకునేందుకు ప్రయత్నించే వారు ఎందరో ఉన్నారు.ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది.
ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి, వ్యాయామాలు చేయకపోవడం, హార్మోన్ల మార్పులు, ఒకే చోట అధిక సమయం పాటు కూర్చోవడం ఇలా రకరకాల కారణాల వల్ల థైస్ ఫ్యాటీగా మారిపోతాయి.బెల్లీ ఫ్యాట్‌తో పోల్చుకుంటే.
ఈ థై ఫ్యాట్ కరిగించుకోవడం కాస్త కష్టమనే చెప్పాలి.అందుకే కొందరు శస్తచికిత్సలు చేయించుకుని మరీ థైఫ్యాట్‌ను వదిలించుకుంటారు.

అయితే కాస్త శ్రద్ధతో మరియు సహనంతో ప్రయత్నిస్తే.సహజంగానే థైఫ్యాట్‌ను కరిగించుకోవచ్చు.అందు కోసం ఏం చేయాలి? అన్నది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా డైట్‌లో మార్చులు చేసుకోవాలి.
ఎందుకంటే, కొన్ని కొన్ని ఆహారాలు థైఫ్యాట్ వేగంగా తగ్గించడంలో గ్రేట్‌గా సహాయ పడతాయి.అలాంటి వాటిలో బీన్స్ ఒకటి.
బీన్స్‌లో ప్రోటీన్ ఎక్కువగా, క్యాలరీలు తక్కువ.వీటిని తీసుకోవడం వల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్‌తో పాటు థైఫ్యాట్ సూపర్‌గా తగ్గుతుంది.
అలాగే థైఫ్యాట్‌ను నివారించడంలో గ్రీన్ టీ కూడా ఉపయోగపడుతుంది.రోజుకు ఒకటి, రెండు కప్పుల గ్రీన్ టీ తీసుకుంటే.
శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు అంతా కరుగుతుంది. గుడ్లు, నట్స్ , సీడ్స్ కూడా ఫ్యాట్‌ను తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.
కాబట్టి, వీటిని ఖచ్చితంగా డైట్‌లో చేర్చు కోవాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా థైఫ్యాట్‌ను ఫాస్ట్‌ను తగ్గించగలదు.ప్రతి రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ చప్పున ఆపి్ సైడర్ వెనిగర్ మరియు తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ఇక వ్యాయామాల్లో రన్నింగ్, సైకిలింగ్, హై జంప్స్, స్వమ్మింగ్ వంటివి చేస్తే.
త్వరగా థైఫ్యాట్‌ను నివారించుకోవచ్చు.