కనుబొమ్మలు ఒత్తుగా ఉంటే ముఖం మరింత అందంగా, ఎట్రాక్టివ్‌గా కనిపిస్తుంది.అందుకే అందరూ ఒత్తైన కనుబొమ్మలను కావాలని ఆరాటపడుతుంటారు.
కానీ, అందరికీ అలా ఉండకపోవచ్చు.అయితే ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ టిప్స్‌ను పాటిస్తే గనుక.
చాలా తక్కువ కాలంలోనే ఒత్తైన కనుబొమ్మలను తమ సొంతం చేసుకోవచ్చు.మరి ఏ మాత్రం టైమ్ వేస్ట్ చేయకుండా ఈ టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
మందారం పువ్వులు కనుబొమ్మలను ఒత్తుగా మార్చడంలో అద్భుతంగా సమాయపడతాయి.ముందగా ఒక మందారం పువ్వును మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు కనుబొమ్మలను వాటర్‌తో క్లీన్ చేసుకుని.అపై మందారం పువ్వు పేస్ట్‌ను అప్లై చేయాలి.
ఇరవై నిమిషాల పాటు ఆరిన తర్వాత కూల్ వాటర్‌తో స్మూత్‌గా క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు చేస్తే.
కనుబొమ్మలు క్రమ క్రమంగా ఒత్తుగా మారతాయి.
అలాగే మెంతులు కూడా పలచని కనుబొమ్మలను ఒత్తుగా మార్చగలవు.ముందుగా కొన్ని మెంతులను తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.ఇప్పుడు అర స్పూన్ మెంతి పొడిలో ఒక స్పూన్ కొబ్బరి నూనెను యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కనుబొమ్మలపై అప్పై చేసి.పది నిమిషాల అనంతరం వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేసినా కూడా మంచి ఫలితాన్ని పొందొచ్చు.
ఇక చాలా మంది కనుబొమ్మలను ఒత్తుగా మార్చుకునేందుకు పాలను రాస్తుంటారు.
కానీ, పాల కంటే కొబ్బరి పాల మరింత సూపర్‌గా పని చేస్తాయి.ఫ్రెష్ గా ఉండే కొబ్బరి పాలను కనుబొమ్మలపై అప్లై చేసి స్మూత్‌గా మసాజ్ చేసుకోవాలి.
ప్రతి రోజు నిద్రించే ముందు ఇలా చేసి.ఉదయాన్నే చల్లటి నీటితో వాష్ చేసుకోవాలి.
తద్వారా కనుబొమ్మలు ఒత్తుగా, నల్లగా పెరుగుతాయి.