అవకాడో పండు.దీని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవకాడో పండు.మధుమేహం, క్యాన్సర్, రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
అంతేకాదు, అందమైన, మెరిసే చర్మం అందించడంలోనూ అవకాడో గ్రేట్‌గా ఉపయోగపడుతుంది.అయితే అవకాడోను చర్మానికి ఎలా ఉపయోగించాలో చాలా మందికి తెలియకపోవచ్చు.
అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఫాలో అయితే సరి.
అందులో ముందుగా.
బాగా పండిన అవకాడోను తీసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి.ఈ పేస్ట్‌లో కొద్దిగా తేనె మిక్స్ చేసి.
ముఖానికి బాగా అప్లై చేయాలి.ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాల పాటు ఆరనిచ్చి అనంతరం గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఇలా తరచూ చేయడం వల్ల ముఖంపై ఉన్న మొటిమలు క్రమంగా తగ్గడంతో పాటు మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

రెండొవది.ఒక బౌల్‌లో అవకాడో పేస్ట్ తీసుకుని.అందులో కొద్దిగా బాగా పండిన అరటి పండు పేస్ట్‌ను మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా అప్లై చేసి.ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖానికి క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారినికి మూడు లేదా నాలుగు సార్లు చేయడం వల్ల ముఖంపై ముడతలు పోయి.యవ్వనంగా మారుతుంది.
ఇక మూడొవది.ఒక బౌల్‌లో అవకాడో పేస్ట్ మరియు ఓట్మీల్ వేసి బాగా కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల.ముఖంపై మృతకణాలు తొలగుతాయి.
అలాగే ముఖంపై ఉన్న మచ్చలు పోయి.ప్రకాశవంతంగా మారుతుంది.
సో.ఈ సింపుల్ టిప్స్‌ను మీరు కూడా ట్రై చేసి.అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోండి.