జింకలను చూడడానికి భలే చూడముచ్చటగా ఉంటాయి కదా.వాటి కొమ్మల్లాంటి కొమ్ములు చూస్తే ఎవరయినా సరే ఇట్టే ఆకర్షితులవుతారు.
జింకలకు వాటి కొమ్ములే ప్రధాన ఆకర్షణ.అడవిలో ఆకులు, కొమ్మలను తింటూ చెంగు చెంగున ఎగురుతూ భలే సందడి సందడి చేస్తూ ఉంటాయి.
అలాగే జింకలను ఎక్కువగా పులులు వేటాడం మనం చూసే ఉంటాము.పులి బారిన నుండి తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం జింక పెట్టే పరుగు మాములుగా ఉండదు మరి.అలాంటి కొమ్ములున్న ఒక జింక బంతిని గోల్ లో వేసి భలే మురిసిపోయింది.జింక గోల్ చేయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.
ఈ వీడియో చూస్తే మీకే అర్ధం అవుతుంది.
ప్రస్తుతం ఈ జింక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
ఈ మధ్య కాలంలో జంతువులకు సంబందించిన వీడియోలు నెట్టింట్లో బాగా వైరల్ గా మారుతున్నాయి.ఈ క్రమంలోనే జింక వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు.ఎప్పుడో రెండేళ్ల కిందట సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఇది.2019లో పోస్ట్ అయిన ఈ వీడియోకి అప్పట్లో కూడా మంచి వ్యూస్, లైక్స్ వచ్చాయి.మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జింక తన కొమ్ములతో బంతిని గోల్‌పోస్ట్ వరకు నెట్టుకుని వస్తుంది.అక్కడ దాక వచ్చాక తన కొమ్మలాంటి కొమ్ములతో గట్టిగా ఆ బంతిని లోపలికి నెట్టి గోల్ చేస్తుంది.గోల్ చేసిన వెంటనే ఆ జింక ఆనందంతో గెంతులు.దానికి తెలిసిపోయినట్లు ఉంది తాను కూడా గోల్ వేశానని బహుశా అందుకేనేమేమో పట్టరాని ఆనందంతో తెగ చిందులు వేసేసింది.12 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు భలే ముచ్చట పడుతున్నారు.గోల్ వేయగానే ఆ జింక ఆనందంతో ఎగరడం చుసిన నెటిజన్లు భలే ఖుషి అవుతున్నారు.