యంగ్ హీరో నాని ద్వి పాత్రాభినయం చేసిన శ్యామ్ సింగ రాయ్ సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ శుక్రవారం భారీ ఎత్తున క్రిస్మస్ కానుకగా రాబోతున్న శ్యామ్ సింగ రాయ్ సినిమా కు రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వం వహించాడు.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.ఈ సినిమా కాస్త అటు ఇటుగా రెండున్నర గంటల సినిమాగా రాబోతుంది.
ఇటీవల విడుదల అయిన పుష్ప సినిమా మూడు గంటల పాటు నిడివి ఉండటంతో విమర్శలు వస్తున్నాయి.బోరింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ అవ్వడంతో కాస్త తగ్గించే ప్రయత్నం చేశారు.
ఆది వారం నుండి పది నుండి 15 నిమిషాల తక్కువ నిడివితో స్క్రీనింగ్ అవ్వబోతుంది.పుష్ప సినిమా కు అయిన అనుభవంను దృష్టిలో పెట్టుకున్నారో లేదా మరేంటో కాని శ్యామ్ సింగ రాయ్ ని రెండున్నర గంటలకే పరిమితం చేశారు.
జాతీయ అవార్డు గ్రహీత నవీన్ ఈ సినిమాకు కత్తెర పెట్టాడు.కనుక ఖచ్చితంగా సినిమా మంచి స్క్రీన్ ప్లేతో సాగుతుందని అనిపిస్తుంది.
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఒక థ్రిల్లింగ్ కథతో ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించాడు.సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యి సినిమా రెండున్నర గంటలు మాత్రమే ఉందని తేలిన తర్వాత ప్రేక్షకులు మరియు నాని అభిమానులు రిలాక్స్ అవుతున్నారు.ఖచ్చితంగా ఇది సినిమాకు ప్లస్ అయ్యే విషయం అంటున్నారు.రికార్డు బ్రేకింగ్ వసూళ్లు ఈ సినిమాకు వస్తాయనే నమ్మకంతో నాని ఉన్నాడు.నాని గత రెండు సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
రెండు సినిమాలు కూడా నిరాశ పర్చాయి.నాని మరియు సాయి పల్లవి ల కాంబో సన్నివేశాలు మరియు ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి పాత్ర ప్రతి ఒక్కటి కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయని అంటున్నారు.చాలా రోజుల తర్వాత మడోనా సెబాస్టియన్ ఈ సినిమా లో నటించడం జరిగింది.