నటి మౌని రాయ్ అంటే చాలామంది గుర్తు పట్టకపోవచ్చు కానీ నాగిని సీరియల్ ప్రేమ్ మౌని రాయ్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు.నాగిని సీరియల్ ద్వారా హిందీ, తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈమె బాగా సుపరిచితం.2015 – 16 లో వచ్చిన నాగిని 1 సీరియల్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకుంది.నాగిని సీరియల్ లో ఈమె శివకన్యగా నటించింది.
ఈమె ఆ సీరియల్ లో శివానిగా నటిస్తూ తన ఆకారాన్ని పాము రూపంలోకి మార్చేస్తుంది.
ఈ పాత్రకు అత్యధిక పారితోషికం పొందే హిందీ టెలివిజన్ నటీమణులలో ఒకరిగా స్థిరపడింది మౌనీ రాయ్.
ఈ సీరియల్ తర్వాత సీక్వెల్ గా వచ్చిన నాగిని 2 లో కూడా తల్లి శివన్య, కూతురు శివంగిగా కూడా రెండు పాత్రలు ఆమె నటించింది.సీరియల్లో భయంకరమైన లుక్ లో కనిపించే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అబ్బుర పరుస్తూనే ఉంటుంది.
ఈమె ఒక వైపు సీరియల్ లో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.ఈమె పొట్టి పొట్టి బట్టలు నుంచి సాంప్రదాయ దుస్తులు ధరించే ప్రతి ఒక్క అవుట్ ఫిట్ లో మనోహరంగా కనిపిస్తూ ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈమె ఇన్ స్ట్రా గ్రామ్ లో బీచ్ లో షికారు చేస్తున్న ఒక అందమైన వీడియోని షేర్ చేసింది.
అందులో మౌనీ రాయ్ తెల్లటి పొట్టి గౌను ధరించి బీచ్ లో వయ్యారంగా నడుస్తుంది.ఇందులో ఒక వైపు సముద్రం, మరొక వైపు సూర్యుడు చుట్టూ ఉన్న క్లైమెట్ చూస్తే అతి సుందరంగా కనిపిస్తోంది.