ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10 వేలకే అదిరిపోయే స్మార్ట్ టీవీలు.. ఏ బ్రాండ్స్ అంటే?

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 21 వరకు బిగ్ సేవింగ్ డే సేల్ నిర్వహిస్తోంది.ఈ సమయంలో రకరకాల వస్తువులపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తోంది.

 Smart Tvs Priced At Rs 10,000 On Flipkart What Are The Brands, Flipkart, 10thous-TeluguStop.com

ముఖ్యంగా సెల్ లో భాగంగా స్మార్ట్ టీవీలపై ఆకర్షణీయమైన డీల్స్ తీసుకొచ్చింది.దాంతో చాలా స్మార్ట్ టీవీలు రూ.10 వేల ధరకే అందుబాటులోకి వచ్చాయి.మరి ఆ టీవీలో ఏవో ఇప్పుడు చూద్దాం.

1.కూకా 32 అంగుళాల స్మార్ట్ టీవీ

కూకా (COOCAA) 32 అంగుళాల స్మార్ట్ టీవీ ప్రస్తుతం 10,499 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది.దీని ఎమ్మార్పీ ధర రూ.36,990గా ఉంది.అయితే సేవింగ్స్ సెల్ లో భాగంగా ఈ టీవీపై 71 శాతం డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్‌.ఈ ఎల్ఈడీ టీవీలో యూట్యూబ్ వీడియోలు యాక్సెస్ చేయవచ్చు.ఈ టీవీలో రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు, 20 వాట్స్ ఆడియో అవుట్ పుట్, డాల్బీ ఆడియో సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇచ్చారు.రూ.9 వేల వరకు ఎక్స్ చేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్ తో దీనిని చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

2.అడ్సున్ 32 అంగుళాల స్మార్ట్ టీవీ

అడ్సున్ (Adsun) 32 అంగుళాల ఎల్ఈడీ స్మార్ట్ టీవీలో నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, యూట్యూబ్ వంటి స్ట్రీమింగ్ వీడియో యాప్స్ పొందవచ్చు.ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే దీని ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,499గా ఉంది.సేల్ లో భాగంగా ఈ కొత్త సంవత్సరానికి 32 ఇంచుల టీవీని పదివేలకే దక్కించుకోవచ్చు.

ఇందులో 2 హెచ్‌డీఎంఐ, 2 యూఎస్‌బీ పోర్టులు ఉన్నాయి.ఇది 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.

Telugu Thousand, Flipkart, Latest, Smart Tv-Latest News - Telugu

3.లమ్ఎక్స్ 32 అంగుళాల స్మార్ట్ టీవీ

లమ్ఎక్స్ (LUMX) 32 ఇంచుల స్మార్ట్ టీవీ ధర రూ.10,990కు తగ్గింది.దీని ఎమ్మార్పీ ధర దాదాపు రూ.27 వేలు ఉంటే దీనిపై 60% డిస్కౌంట్ ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది.ఇది 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.

ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోకు సపోర్ట్ చేస్తుంది.ఇందులో 1 హెచ్‌డీఎంఐ, 2 యూఎస్‌బీ పోర్టులు ఉన్నాయి.

Telugu Thousand, Flipkart, Latest, Smart Tv-Latest News - Telugu

4.డ్యానోరా 32 అంగుళాల స్మార్ట్ టీవీ

డ్యానోరా (Dyanora) 32 ఇంచుల స్మార్ట్ టీవీ రూ.11,999 వద్ద అమ్ముడవుతోంది.బ్యాంక్ ఆఫర్ తో దీనిని మరింత తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు.అయితే ఇదే బ్రాండ్ లో 32 అంగుళాల రెడీ హెచ్‌డీ ఎల్ఈడీ టీవీ ధర రూ.10,999 కే లభిస్తోంది.

పైన పేర్కొన్న స్మార్ట్ టీవీలకు సంబంధించిన రివ్యూస్ చదివి మీకు ఉత్తమంగా అనిపించిన టీవీని మీరు కొనుగోలు చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube