సముద్ర ఖని( Samudrakhani ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.గత కొన్నిరోజులుగా సముద్ర ఖని హాట్ టాపిక్ అవుతున్నారు.
మంచి నటుడిగానే కాకుండా మంచి సినిమాలు కూడా తీయడంలో ఆయనకు ఆయనే సాటి.గత కొన్నేళ్లుగా సముద్ర ఖని బ్రో( Bro ) సినిమాతో బిజీగా ఉన్నారు.
అల వైకుంఠపురంలో అద్భుతమైన పాత్ర చేసిన ఆయన తాజాగా విడుదలైన విమానం సినిమాలో ఎమోషనల్ పెరఫార్మన్స్ ఇచ్చారు.ఇక ఇప్పుడు సముద్ర ఖని బ్రో సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్( Pawan Kalyan, Sai Dharam Tej ) కలిసి నటించిన సినిమా బ్రో.బ్రో సినిమాకి దర్శకత్వం చేసింది సముద్ర ఖని అందరికి తెలిసిందే.
ఈ సినిమా ఈ నెలలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.అందులో భాగంగా ఈ సినిమా టీం మొత్తం ప్రమోషన్స్ లో బిజీ అయిపోయారు.
అయితే తాజాగా ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాడు.దీంతో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

సముద్ర ఖని కేవలం సినిమాలకే కాదు అద్భుతమైన సీరియల్ కి కుడి ఆదర్శకత్వం వహించాడట.బ్లాక్ బస్టర్ సీరియల్ పిన్ని( pinni) గురించి చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సీరియల్ రెండు భాగాలుగా వచ్చింది.సుమారుగా 3000 ఎపిసోడ్స్ తో భారీ హిట్ గా నిలిచిన ఈ సీరియల్ కి సముద్ర ఖని దర్శకత్వం వహించారు.
ఈ సీరియల్ లో హీరోయిన్ రాధిక( Radhika ) ప్రధాన పాత్రలో నటించారు.మొదటి భాగం పిన్న కాగా రెండో భాగం ఝాన్సీ.ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సీరియల్ కి సముద్ర ఖని దర్శకత్వం వహించారని చాలా మందికి తెలీదు.ఈ విషయాల్ని ఇప్పుడు వెలుగులోకి రాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంతేకాదు సముద్ర ఖని ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలని అందించారు.సముద్ర ఖని రవితేజ, అల్లరి నరేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా శంభో శివ శంభోని కూడా దర్శకత్వం చేసాడు.
ఈ సినిమా భారీ హిట్ కాకపోయినా మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈ వారం విడుదలయ్యే బ్రో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొడితే సముద్ర ఖని పేరు మారుమోగిపోతుంది అనడంలో సందేహం లేదు.