రాగులు నుంచి తయారయ్యే రాగి పిండిని( Ragi powder ) దాదాపు అందరి ఇళ్లల్లో వాడుతుంటారు.ముఖ్యంగా రాగి పిండితో జావ తయారు చేసుకుని రోజు తీసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది.
అలాగే రాగి పిండితో దోశ, ఇడ్లీ, చపాతి వంటివి తయారు చేసుకుని కూడా తీసుకుంటారు.రాగి పిండిలో పోషకాలు మెండుగా ఉంటాయి.
అందువల్ల దాంతో ఏ వంటకం చేసుకుని తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిదే.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికి మెరుగులు దిద్దడానికి కూడా రాగి పిండి సహాయపడుతుంది.
ఇప్పుడు చెప్పబోయే విధంగా రాగి పిండిని వాడితే మీ అందం రెట్టింపు అవుతుంది.మరి ఇంకెందుకు లేటు రాగి పిండిని చర్మానికి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు రాగి పిండి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ గులాబీ రేకుల పొడి( Rose Petal Powder ), వన్ టేబుల్ స్పూన్ తేనె( honey ) మరియు సరిపడా హోమ్ మేడ్ బాదం పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒకసారి కనుక చేస్తే చర్మం పై పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగిపోతాయి.టాన్ రిమూవ్( Remove tan ) అవుతుంది.మచ్చలు ఏమైనా ఉంటే తగ్గుముఖం పడతాయి.

చర్మం అందంగా, కాంతివంతంగా మారుతుంది.షైనీగా మెరుస్తుంది.రాగి పిండిలో ఉండే పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
యవ్వనాన్ని పెంచుతారు.వయసు పై పడిన సరే ముడతలు చారలు వంటి వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా అడ్డుకుంటాయి.
కాబట్టి అందంగా గ్లోయింగ్ గా మెరిసిపోవాలని కోరుకునే వారు రాగి పిండితో తప్పకుండా పైన చెప్పిన రెమెడీని ట్రై చేయండి.