సాధారణంగా చాలా మంది తమ ముఖ చర్మాన్ని అందంగా, కాంతివంతంగా మెరిపించుకునేందుకు నెలలో రెండు మూడు సార్లు అయినా ఫేషియల్( Facial ) చేయించుకుంటూ ఉంటారు.ఇందుకోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.
కానీ ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇరవై నిమిషాల్లో గ్లోయింగ్, షైనీ స్కిన్ ను తమ సొంతం చేసుకోవచ్చు.ఈ రెమెడీ ముందు ఫేషియల్ కూడా సరిపోదు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బంగాళదుంప( Potato ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, రెండు లెమన్ స్లైసెస్,( Lemon Slices ) హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి, వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ పెరుగు( Curd ) వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, కావాలి అనుకుంటే చేతులకు కూడా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ రెమెడీని పాటిస్తే ఫేషియల్ అక్కర్లేదు.మీ స్కిన్ సహజంగానే అందంగా గ్లోయింగ్ గా మెరుస్తుంది.స్కిన్ టోన్( Skin Tone ) ఇంప్రూవ్ అవుతుంది.
చర్మంపై మలినాలు, మృత కణాలు పేరుకుపోకుండా ఉంటాయి.చర్మం చాలా మృదువుగా మారుతుంది.
ముడతలు, చారలు వంటి వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.పిగ్మెంటేషన్ సమస్య నుంచి సైతం సులభంగా బయటపడొచ్చు.
కాబట్టి సహజంగానే అందంగా మెరిసిపోవాలని భావించేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.