బేబీ సినిమా( Baby movie ) చాల బాగుంది అని రివ్యూ లు వస్తున్నాయి.మొదటి రోజు కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి.
ఇప్పటికే ఓటిటి, సాటిలైట్ అని బాగానే డబ్బులు వసూల్ అయ్యాయి.విజయ్ దేవరకొండ తమ్ముడు కాబట్టి జనాలు సినిమాకు వెళ్తున్నారు అని మొదటి సినిమా నుంచి ప్రేక్షకులు ఫీల్ అవుతూ ఉంటారు.
కానీ చాల రోజుల తర్వాత తన ఖాతాలో ఒక సాలిడ్ హిట్ వేసుకోగలిగాడు ఆనంద్ దేవరకొండ.ఈ సినిమా తర్వాత తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయ్.

ఇక్కడ వరకు అంత బాగానే వుంది కానీ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది మాత్రం హీరోయిన్ వైష్ణవి చైతన్య.ఆమె చాల బాగా నటించగలిగింది.మొదటి సినిమానే అయినా కూడా ఎక్కడ తన నటనలో ఫ్రెషర్ అనే ఫీలింగ్ కనిపించలేదు.కానీ అదే ఆనంద్ దేవరకొండ విషయానికి వస్తే కొన్ని సీన్స్ లో అతడు తేలిపోయాడు.
ఎమోషన్స్ అన్ని కూడా ఆనంద్ దేవరకొండ చేయాల్సినవి కావడం తో ఎంతో బాగా ఎలివేట్ అయ్యే ఛాన్స్ ఉన్న కూడా ఆనంద్ తనను తాను మెరుగు పరుచుకోలేదు.ఎమోషన్స్ చూపించాల్సిన మేర చూపించకపోవడంతో ఆ పోర్షన్ కూడా వైష్ణవి( Vaishnavi Chaitanya ) ఖాతాలోకి వెళ్ళిపోయింది.
కథ బాగుంది కాబట్టి సినిమా హిట్ అయ్యింది కానీ నటుడు మంచి వాడు అయితే ఆ చిత్రం మరో రేంజ్ లో ఉంటుంది.

ఇకనైనా ఆనంద్ దేవరకొండ తన లుక్స్ పరంగా కాస్త శ్రద్ద పెట్టి బారి ఎమోషన్ సీన్స్ విషయంలో మెరుగు పరుచుకోవాల్సిన అవసరం వుంది.ఈ సినిమా తర్వాత ఆనంద్ కన్నా కూడా వైష్ణవి బాగా బిజీ అయ్యే అవకాశం వుంది.విజయ్ దేవరకొండ తమ్ముడిగా కాకుండా తన ఓన్ మార్కెట్ క్రియేట్ చేసుకుంటే తప్ప కెరీర్ పరంగా ముందుకెళ్లడం అసాధ్యం.
ఇక ఆనంద్ దేవరకొండ( Anand devarakonda ) కు తన గొంతు పెద్ద బలం.క్లోసప్ సన్నివేశాల్లో అతడి వాయిస్ చాల బాగా అనిపించింది.కానీ సీన్స్ విషయానికి వచ్చే సరికి అతడి అనుభవ రాహిత్యం చాల స్ప్రష్టం గా కనిపించింది.వాట్ బ్రదర్ అన్నను చూసి నేర్చుకో అంటూ జనాలు సెటైర్స్ వేస్తున్నారు.
ఏది ఏమైనా సినిమా అయితే సూపర్ హిట్.







