ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరూ కూడా పార్టీలు, పబ్బులు అని అనేక రకాల ఈవెంట్స్ ను నిర్వహించడం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో పాటు కలిసి ఏర్పాటు చేసుకున్న విందు పార్టీలు, ఈవెంట్స్ లో పాల్గొనడం సాధారణంగా మారింది.
అయితే చాలా మంది ఫ్రెండ్స్, సహచర ఆటగాళ్లతో కలిసి ఆఫీస్ లలో చేసుకునే పార్టీలలో పాల్గొంటూ ఉంటారు.అలాగే వీకెండ్స్ వచ్చిందంటే చాలు.
కొన్ని ఆఫీసులలో ఉద్యోగులు అందరూ పార్టీలు నిర్వహించి ఎంజాయ్ చేయడం మనం చూస్తూనే ఉంటాం.అయితే, ఈ క్రమంలో మహిళా ఉద్యోగులు( Female employees ) కూడా పాల్గొని పార్టీలలో ఆల్కహాల్ తో పాటు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం మనం చూస్తూనే ఉంటాం.
ఈ క్రమంలో కొంతమంది మహిళలకు చేదు అనుభవాలు కూడా ఎదురవుతూ ఉంటాయి.అయితే, తాజాగా అచ్చం అలాంటి సంఘటననే ఒక మహిళ ఉద్యోగికి ఎదురయ్యింది.
ఇందుకు సంబంధించి ఆ మహిళా ఉద్యోగి కూడా సోషల్ మీడియా ద్వారా తన భావనను వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది.
ఆ మహిళా ఉద్యోగి ఆఫీస్ వాళ్లు టీం బిల్డింగ్ ఈవెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో ఆ మహిళకు కూడా ఆహ్వానం రావడంతో ఈవెంట్ లో పాల్గొనింది.ఈ క్రమంలో ఆ అమ్మాయి ఇన్టన్ గా పనిచేస్తుంది.
అయితే ఈవెంట్ కు వెళ్లకపోతే ఏమవుతుందో అని ఆలోచనతో ఆ అమ్మాయి భయపడి కార్యక్రమానికి హాజరయింది.అయితే అక్కడికి వెళ్లిన అనంతరం జరిగిన సంఘటన ఆ అమ్మాయికి చిక్కు ఎదురైంది.
టీం బిల్డింగ్ ఈవెంట్ పేరుతో అక్కడ అనేక రకాల గేమ్స్ ఛాలెంజ్( Games Challenge ) లు ఏర్పాటు చేశారు.ఇందులో భాగంగానే మూడు గ్లాసుల మద్యం తాగాలని లేకపోతే ఆమె తండ్రి వయసు ఉన్న వ్యక్తికి ముద్దులు ఇవ్వాల్సిందే అంటూ కండిషన్ పెట్టారు.
దీంతో ఆ యువతి ఒక్కసారిగా షాక్ అయింది.అంతేకాకుండా ఆ గేమ్ ఆడేందుకు ఆ మహిళ నిరాకరించడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అయితే, చివరకు ఆ అమ్మాయి కన్నీరు మున్నీరు అవుతూ మూడు గ్లాసుల వైన్ ను తాగేసింది.అయితే ఈ తరుణంలో పార్టీ జరిగిన అనంతరం ఆఫీసులో ఆ మహిళ సదరు మేనేజర్ కు ఫిర్యాదు చేయగా మేనేజర్ నుంచి సానుకూలంగా స్పందించకపోవడంతో ఆ అమ్మాయి కంపెనీ నుంచి వెళ్ళిపోవడంతో పాటు తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.