కన్నడ స్టార్ హీరో కిచ్చా సుధీప్ ( Sudeep )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈయనకు టాలీవుడ్ తో పాటు శాండల్ వుడ్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
తెలుగుతోపాటు ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి భారీగా అభిమానులను సంపాదించుకున్నారు.రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సిరీస్ తో మొదటిసారి నేరుగా తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడు కిచ్చా సుదీప్.
ఆ తర్వాత రాజమౌళి ఈగ( Eega)లో విలన్ గా చేశాడు.ఈ సినిమా తోనే తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు.
ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి, ప్రభాస్ బాహుబలి సినిమాల్లోనూ కీలక పాత్రల్లో మెరిశాడు.
తెలుగులో కిచ్చా సుదీప్ కీ బాగా గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా ఈగ సినిమా అని చెప్పాలి.కాగా 1997 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు సుదీప్.ఇప్పటికీ అదే యంగ్ అంగ్ ఎనర్జిటివక్ ఫెర్మామెన్స్ తో అభిమానులను అలరిస్తున్నాడు.
సుదీప్ ప్రియా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఈ దంపతులకు ఒక కూతురు ఉంది.
సాధారణంగా సుదీప్ కూతురంటే ఒక 10-15 ఏళ్ల అమ్మాయి అయి ఉంటుందిలే అనుకుంటారు చాలా మంది.అయితే ఆయన కూతురు వయసు సుమారు 20 ఏళ్లు.
అవును.తన పేరు శాన్వి సుదీప్.
మరి 20 ఏళ్ల కూతురు ఉందంటే సుదీప్ వయసు ఎంతు ఉంటుందో గెస్ చేయగలరా? యంగ్ హీరోలా స్మార్ట్ గా, స్టైలిష్ గా కనిపించే అతని వయసు 52 ఏళ్లు.
ఇకపోతే కిచ్చా సుదీప్ కూతురు శాన్వి సుదీప్( Sanvi Sudeep ) విషయానికివస్తే.ప్రస్తుతం ఈ అమ్మాయి చదువుకుంటోంది.అదే సమయంలో సింగర్ గానూ తన సత్తా చాటుతోంది.
కిచ్చా సుదీప్ తన మేనల్లుడు సంచిత్ సంజీవ్ ను పరిచయం చేస్తూ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ మూవీకి అతనే దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమా కోసం తన గొంతును వినిపించింది శాన్వి.వీటన్నటినీ పక్కన పెడితే శాన్వీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఎప్పటికప్పుడూ అందులో షేర్ చేస్తుంటుంది.అలాగే తన తల్లిదండ్రుల ఫొటోలను కూడా అందులో పంచుకుంటుంది.
సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫొటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంటాయి.శాన్వీ ఫొటోలు చూసిన వారందరూ హీరోయిన్ లా ఉందంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం పక్కా అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా శాన్వీ ఫోటోస్ చూసేయండి.