భారతదేశంలో కొరియన్ యూట్యూబర్ అపహరణ.. చివరికి ఏమైందో తెలిస్తే..?

ఇటీవల కాలంలో కొంతమంది భారతీయులు మరీ రాక్షసుల్లా మారిపోతున్నారు.రేప్‌లు, మర్డర్లు, కిడ్నాప్‌లు, మోసాలు, డ్రగ్స్ ఇచ్చి మానప్రాణాలు దోచుకోవడం ఇండియాలో కామన్ అయిపోయింది.

 Kidnapping Of Korean Youtuber In India.. What Happened In The End, Cycling Adv-TeluguStop.com

ఇండియా సేఫ్‌ కంట్రీ కాదని విదేశీయులు గట్టిగా నమ్మేలా చెడు పేరు తీసుకొస్తున్నారు.తాజాగా కొరియా దేశానికి చెందిన యూట్యూబర్ లెరికోకి ఇండియాలో ఒక భయంకరమైన అనుభవం ఎదురయింది.

లడఖ్( Ladakh ) ప్రాంతంలో సైకిల్‌పై ప్రయాణం చేస్తున్నప్పుడు కొందరు స్థానికులు ఆపారు.మంచి మనసున్న వాళ్లలా నటిస్తూ ఆయన్ని అపహరించారు.

ఆపై డ్రగ్స్ ఇచ్చారు.

Telugu Adventure, Drugs, India, Korean Youtuber, Ladakh, Leh, Lerrico, Nri-Telug

లెహ్ అనే ప్రదేశానికి సైకిల్‌పై 450 కిలోమీటర్లు ప్రయాణించాలని లెరికో( Lerrico ) టార్గెట్ పెట్టుకున్నాడు.ఈ సైకిల్ యాత్ర చేస్తున్న లెరికో కొన్ని రోజుల తర్వాత బాగా అలసిపోయాడు.అదే సమయంలో దారిలో కలిసిన కొంతమంది స్థానికుల వాహనంలో ఎక్కాడు.

కానీ వాళ్ళు అతన్ని మోసం చేసి, దారి మళ్ళించి అడవిలోకి తీసుకెళ్లి కట్టేశారు.కర్రలతో బెదిరించి అతన్ని బాధపెట్టారు.

లెరికో మాట్లాడుతూ “వాళ్లు నన్ను రెండుసార్లు డ్రగ్స్( Drugs) తీసుకోమని బలవంతపెట్టారు.మొదటిసారి డ్రగ్స్ తీసుకున్నట్లు నటించి, దాన్ని నా చేతిలో దాచాను.

కానీ 30 నుంచి 40 నిమిషాల తర్వాత, వాళ్లు నాకు మరో డ్రగ్ ఇచ్చారు.ఈ సారి వాళ్లు నేను డ్రగ్స్ తీసుకుంటున్నానో లేదో చూస్తూనే ఉన్నారు.

కాబట్టి నేను బలవంతంగా దాన్ని తీసుకోవాల్సి వచ్చింది.ఆ డ్రగ్ తీసుకున్నాక 5 నుంచి 6 గంటల పాటు ఏమీ తెలియకుండా ఉండిపోయా.” అని చెప్పాడు.

Telugu Adventure, Drugs, India, Korean Youtuber, Ladakh, Leh, Lerrico, Nri-Telug

అపహరించిన వాళ్లు లెరికో చేత ఒక తెలియని డ్రగ్ రెండుసార్లు తాగించారు.దాంతో అతను చాలా గంటలు తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని మానసిక పరిస్థితికి చేరుకున్నాడు.అంతటి కష్టం అనుభవించినప్పటికీ, లెరికో ఎలాగోలా తన స్నేహితుడిని సంప్రదించి, పోలీసులకు సమాచారం ఇప్పించాడు.30 గంటల తర్వాత అతన్ని విడిపించారు కానీ, చాలా డబ్బును కోల్పోయాడు.ముందుగా, పోలీసులు ఎవరి పరిధిలో వస్తుందనే విషయంలో తగాదా పడుతూ, నెమ్మదిగా స్పందించారు.

కానీ తరువాత ఎక్కువ ఒత్తిడి తెచ్చిన తర్వాత, అపహరించిన వాళ్లను పట్టుకున్నారు.మొదట వాళ్లు ఆ ఆరోపణలను తిరస్కరించారు కానీ, తీవ్రంగా విచారించిన తర్వాత ఒప్పుకున్నారు.

విచారణ సమయంలో పోలీసులు తమను హింసించారని వాళ్లు ఆరోపించారు.లెరికో “అపహరించిన వాళ్లు స్టేషన్‌లో ఒకటిన్నర గంట పాటు మోకాళ్లపై వేడుకుంటూ ఉండిపోయారు.

పోలీసులు వాళ్లను చాలా కొట్టారు.పోలీసులు ‘పాపం వీళ్లు‘ అని అంటూనే వాళ్లను కొట్టడం కొనసాగించారు.” అని చెప్పాడు.లెరికో కేసు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దీంతో ఆ ప్రాంతంలో ప్రయాణికుల భద్రత గురించి చాలా మంది ఆందోళన చెందారు.ఆన్‌లైన్‌లో ఈ సంఘటనపై తీవ్ర స్పందన వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube