ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి జీవన శైలి, ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి.దీంతో చిన్న వయసులోనే చాలా వ్యాధులు సంభవిస్తాయి.
అందులో ముఖ్యమైన వ్యాధి థైరాయిడ్( Thyroid ).ఈరోజుల్లో టీనేజీ యువత కూడా థైరాయిడ్ బారిన పడుతుంది.ఒకప్పుడు థైరాయిడ్ 50 ఏళ్ల తర్వాత వచ్చేది వీటిలో 60 శాతానికి పైగా కేసులు మహిళల్లోనే ఉంటాయి.కానీ ఇది చరిత్రను తిరగరాస్తోంది.థైరాయిడ్ వయసు పెరిగే కొద్దీ ముదురుతూ ఉంటుంది.చిన్న వయసులోనే థైరాడ్ ఎందుకు సంభవిస్తుందో, దాని ప్రారంభ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
థైరాయిడ్ గ్రంధి ( Thyroid gland )శరీరం సరిగా లేనప్పుడు ఈ వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.ఇందులో రెండు రకాలు ఉంటాయి.

థైరాయిడ్ హార్మోన్ తక్కువగా పనిచేస్తే హైపోథైరాయిడిజం( Hypothyroidism ) అంటారు.అదే ఎక్కువగా పని చేస్తే దానిని హైపర్ థైరాయిడిజం అని అంటారు.థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ లేదా తక్కువ ఉంటే ఈ వ్యాధి కారణమవుతుంది.అయితే ఇంతకుముందు ఈ సమస్య వయసు పెరుగుతున్న కొద్ది వచ్చేది కానీ ఇప్పుడు అలా అవ్వడం లేదు.
అయితే 30 ఏళ్లు పైబడిన వారు థైరాయిడ్ చెక్ చేసుకోవాలని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు.ఎందుకంటే నేటి యువతలో చాలా చిన్న వయసులోనే థైరాయిడ్ వస్తోంది.కొన్ని సందర్భాల్లో హార్మోనల్ ఇంబాలన్స్ కారకాల వలన కూడా చిన్న వయసులోనే ఈ వ్యాధి వస్తుంది.

అంతేకాకుండా రోగినిరోధక వ్యవస్థ ( immune system )శరీరంలోని థైరాయిడ్ గ్రంధి పై దాడి చేసే పరిస్థితి కూడా ఉంటుంది.దీని వలన థైరాయిడ్ అండర్ లేదా ఓవర్ ఆక్టివ్ గా మారిపోతుంది.ఇక కొన్ని సందర్భాల్లో సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, శరీరంలో పోషకాలు లేకపోవడం లాంటి కారణాల వల్ల కూడా థైరాయిడ్ సంభవించే ప్రమాదం ఉంది.
అంతేకాకుండా మానసిక ఒత్తిడి కూడా థైరాయిడ్ వ్యాధికి ప్రధాన కారణమని చెప్పవచ్చు.ఈ మధ్యకాలంలో ప్రజల్లో మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది.అతి చిన్న వయసులోనే ఉద్యోగ ఒత్తిడి, వ్యక్తిగత జీవిత సమస్యల కారణంగా ప్రజలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.ఈ కారణాల ద్వారానే అతి చిన్న వయసులోనే పెద్ద పెద్ద వ్యాధులు రావడానికి కారణం అవుతుంది.