టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉండగా చిరంజీవి ఇంద్ర మూవీ( Indra ) తాజాగా రీరిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.చిరంజీవి అంటే అభిమానులకు ఎంత స్పెషల్ అనే విషయం ఇంద్ర మూవీ రీరిలీజ్ తో మరోసారి క్లారిటీ వచ్చింది.
ఇంద్ర నిర్మాత అశ్వనీదత్ కు చిరంజీవి ఒక అందమైన శంఖాన్ని గిఫ్ట్ గా అందజేశారు.చిరంజీవి తనకు ఇచ్చిన బహుమతి గురించి అశ్వనీదత్ స్పందిస్తూ ఈ విజయ శంఖాన్ని( Conch gift ) కానుకగా మీరు ఇచ్చారని కానీ ఇంద్రుడై, దేవేంద్రుడై దానిని పూరించింది మాత్రం ముమ్మాటికీ మీరేనని అశ్వనీదత్ కామెంట్లు చేశారు.
ఈ కానుక అమూల్యమని ఈ జ్ఞాపకం అపురూపమని ఆయన చెప్పుకొచ్చారు.అదెప్పటికీ నా గుండెలో పదిలం అని అశ్వనీదత్ పేర్కొన్నారు.
ఇంద్ర టీమ్( Indra team) ను కలవడం గురించి చిరంజీవి ట్వీట్ చేస్తూ ఇంద్ర సృష్టించిన సునామీ గుర్తు చేస్తూ 22 సంవత్సరాల తర్వాత మరోసారి థియేటర్లలో విడుదలైన సందర్భంగా చిరు సత్కారం అని ఆయన చెప్పుకొచ్చారు.సినిమా మేకింగ్ విశేషాలను నెమరువేసుకోవడం జరిగిందని చిరంజీవి వెల్లడించారు.
మరోవైపు అశ్వనీదత్( Aswani Dutt ) ఈ సినిమా గురించి స్పందిస్తూ ఇంద్ర మూవీ నా లైఫ్ లో ముఖ్యమైనదని కాలానికి ఎదురీది తరాలను దాటి పోరాటం చేసే వ్యక్తి ఆయన అని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు.త్వరలో చిరంజీవితో ఐదో సినిమా కూడా నిర్మిస్తానని మాట ఇస్తున్నానని ఆయన పేర్కొన్నారు.ఈ కాంబినేషన్ లో జగదేకవీరుడు అతిలోకసుందరి, చూడాలని ఉంది, ఇంద్ర, జై చిరంజీవ సినిమాలు తెరకెక్కాయి.ఈ సినిమాలలో జై చిరంజీవ సినిమా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.
చిరంజీవి రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలోనే ఉందని సమాచారం అందుతోంది.