సాధారణంగా ఒక వయస్సు దాటిన తర్వాత చదువుకోవాలంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఒక నటుడు మాత్రం 68 సంవత్సరాల వయస్సులో ఏడో తరగతి పరీక్షలు రాయడం ద్వారా వార్తల్లో నిలిచారు.
ప్రముఖ మలయాళ నటుడు ఇంద్రన్స్( Indrans ) ఏడో తరగతి పరీక్షలు రాయడం ద్వారా వార్తల్లో నిలిచారు.బాల్యంలో ఈ నటుడు నాలుగో తరగతి వరకే చదువుకున్నారు.
ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ నటుడు బట్టలు లేక టైలర్ గా మారిపోవడం జరిగింది.స్కూల్ కు వెళ్లకపోయినా చదవడం నేర్చుకున్న ఈ నటుడు పెద్దైన తర్వాత నటుడిగా మారారు.మలయాళంలో ఈ నటుడికి మంచి గుర్తింపు ఉంది.1980 సంవత్సరం నుంచి మలయాళంలో పలు సినిమాలలో ఇంద్రన్స్ నటించడం జరిగింది.గతేడాది విడుదలై బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలలో ఒకటైన 2018 సినిమా( 2018 movie)లో ఆయన అంధుడి పాత్రలో నటించి మెప్పించారు.
ఈ సినిమాలో నటనకు గాను ఆయనకు కేరళ ఫిల్మ్ అవార్డ్ ( Kerala Film Award )సైతం సొంతమైంది.అయితే ఇన్నేళ్ల తర్వాత ఇంద్రన్స్ కు పదో తరగతి పాస్ కావాలనే కోరిక కలిగింది.అయితే కేరళ( Kerala )లో ఇప్పటికీ ఏడో తరగతి పాస్ అయితే మాత్రమే 10వ తరగతి పాస్ అయ్యే అవకాశం ఉంది.
తాజాగా తిరువనంతపురంలోని అట్టకుళంగర సెంట్రల్ స్కూల్ లో ఆయన ఏడో తరగతి పరీక్షలు రాశారు.
68 సంవత్సరాల వయస్సులో చదువుకోవాలనే ఉత్సాహం ఉండటం సాధారణమైన విషయం కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇంద్రన్స్ టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.భవిష్యత్తులో ఇంద్రన్స్ తన లక్ష్యాలను సులువుగా సాధించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇంద్రన్స్ ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కాలని ఆయన ఖాతాలో మరిన్ని విజయాలు చేరాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.