వారానికి రెండు సార్లు తీసుకున్నా చాలు ఈ జ్యూస్ రోగాలన్నిటికీ చెక్ పెడుతుంది!

బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు.పోషకాహారం గురించి అస్సలు పట్టించుకోరు.

 Drink This Juice For Good Health!, Healthy Juice, Watermelon Beetroot Juice, Lat-TeluguStop.com

కడుపు నింపుకోవడానికి ఏది పడితే అది తినేస్తుంటారు.కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అన్నిటికంటా ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.

ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము.అందుకే పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.

ముఖ్యంగా మీ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్( Breakfast ) లో ఏమున్నా లేకపోయినా ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను తప్పకుండా చేర్చుకోండి.ఈ జ్యూస్ రోగాలన్నిటికీ చెక్ పెడుతుంది.

మిమ్మల్ని హెల్తీగా మారుస్తుంది.మరి ఇంతకీ ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండి.

Telugu Beetroot, Problems, Tips, Healthy, Latest, Watermelon-Telugu Health

ముందుగా ఒక బీట్ రూట్( Beetroot ) తీసుకొని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలు, బీట్ రూట్ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon Juice ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు.

ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు గ్రైండ్ చేస్తే మన జ్యూస్ రెడీ అవుతుంది.

ఈ జ్యూస్ ను నేరుగా తాగవచ్చు.

లేదా స్టైనర్ సాయంతో ఫిల్టర్ చేసుకుని కూడా తీసుకోవచ్చు.ఈ పుచ్చకాయ బీట్ రూట్ జ్యూస్( Watermelon Beetroot Juice ) ను వారానికి రెండు సార్లు తీసుకున్న చాలు బోలెడు ఆరోగ్య లాభాలు పొందుతారు.

ఈ జ్యూస్ బాడీని డీటాక్స్ చేస్తుంది.శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది.

రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.అలాగే ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల నీరసం అలసట వంటివి వేధించకుండా ఉంటాయి.

రక్తహీనత దూరం అవుతుంది.

Telugu Beetroot, Problems, Tips, Healthy, Latest, Watermelon-Telugu Health

మెదడు మునుపటి కంటే షార్ప్ గా పనిచేస్తుంది.శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.శరీరంలో కొవ్వు ఆమ్లాలు పేరుకుపోకుండా ఉంటాయి.

గుండెపోటు వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది.లివర్( Liver ) ఆరోగ్యంగా మారుతుంది.

చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే క్రమంగా తగ్గుముఖం పడతాయి.స్కిన్ టోన్ సైతం ఇంప్రూవ్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube