ఇటీవల కాలంలో సెలబ్రిటీలు( Celebrities ) ఎక్కువగా తిరుమలలో దర్శనమిస్తున్నారు.ఒకరి తర్వాత ఒకరు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
అయితే కొందరు సెలబ్రిటీలు విఐపి దర్శనాలు( VIP Sightings ) చేసుకుంటుండగా మరికొందరు మాత్రం భక్తితో కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకుంటున్నారు.చాలా తక్కువ మంది సెలబ్రిటీలు మాత్రమే ఇలా కాలినడకన వెళుతున్నారు.
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ కాలి నడకన వెళ్లి స్వామి వారిని దర్శించుకున్న విషయం తెలిసిందే.
తాజాగా కూడా మరొక టాలీవుడ్ స్టార్ హీరో కాలినడకన వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఆ స్టార్ హీరో మరెవరో కాదు నాని( Nani ).హీరో నాని ఆయన సతీమణి అంజన ( Anjana )తనయుడు అర్జున్( Arjun ) తో పాటు నటి ప్రియాంక అరుళ్ మోహన్‌తో( Priyanka Arul Mohan ) కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్లారు.అయితే వీరంత.కూడా అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లారు.మార్గం మధ్యలో అభిమానులతో ఆయన కాసేపు ముచ్చటించారు.పలువురుతో కలిసి ఫొటోలు కూడా దిగారు.
దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇకపోతే నాని సినిమాల విషయానికొస్తే.
నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది.దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు మూవీ మేకర్స్.వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు.డి.వి.వి.దానయ్య, కల్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించారు.కాగా ఈ మూవీ ఆగస్టు 29న అన్ని భాషల్లో విడుదల కానుంది.