మనం ఆ భగవంతుడి కృప కోసం ఎన్నెన్నో పూజలు, అర్చనలు, హోమాలు, యజ్ఞాలు చేస్తుంటాం.అయితే హోమాల్లోనూ చాలా రకాలు ఉంటాయి.
కానీ చాలా మందికి వాటి గురించి తెలియదు.అందరూ హోమాలు చేయించుకుంటారు కానీ వాటి గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు.
అయితే పంచ మహా హోమాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పంచ మహా హోమాల్లోమొదటిది గణపతి హోమం.
అనుకున్న కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరాలంటే చేసే హోమాన్నే గణపతి హోమం అంటారు.మనం ఏవైనా పెద్ద పెద్ద పనులను ప్రారంభించ బోయే ముందు ఈ హోమాన్ని జరిపించడం చాలా మంచిది.
రెండోది చండీ హోమం..
దరిద్రం, భయాలను తొలగించునేందుకు చేసే హోమాన్ని చండీ హోమం అంటారు.మూడోది నవ గ్రహ హోమం.
గ్రహ దోషాన్ని తొలగించు కునేందుకు నవ గ్రహ ప్రీతి కోసం చేసే హోమాన్ని నవ గ్రహ హోమం అంటారు.నాలుగోది సుదర్శన హోమం.
సమస్త దోషాలను తొలగించుకునేందుకు చేసే హోమాన్నే సుదర్శన హోమం అంటారు.అలాగే ఐదోది రుద్ర హోమం.
ఆయుర్ వృద్ధి, ఆరోగ్యం కోసం చేసే హోమాన్ని రుద్ర హోమం అంటారు.ఇలా మనకు ఏది కావాలనుకున్నా, ఎలాంటి దోషాన్ని వదిలించుకోవాలన్నా ఈ పంచ మాహా హోమాలు నిర్వహించి ఆ భగవంతుడి కృపను సొంతం చేసుకోవాలి.
జీవితాన్ని హాయుగా, సంతోషంగా గడపాలి.అందు కోసం మనం ఈ పంచ మహా హోమాలను చేయడం చాలా మంచిది.