మన దేశవ్యాప్తంగా సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంతో ఘనంగా, వైభవంగా జరుపుకుంటారు.పల్లెటూర్లలో సంక్రాంతి పండుగకు ఏర్పాట్లను పది రోజుల ముందు నుంచి మొదలుపెడతారు.
ఎక్కడెక్కడో నివసిస్తున్న వారందరూ సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వస్తూ ఉంటారు.ఈనెల 14వ తేదీ నుంచి మూడు రోజులపాటు సంక్రాంతి సంబరాలు జరుగుతాయి.
మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ పర్వదినాలను ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.
ఈ పండుగను ఒక్కో రోజు ఒక ప్రత్యేకతతో జరుపుకుంటూ ఉంటారు.
మకర సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగను ప్రజలందరూ జరుపుకుంటారు.ఈరోజు తెల్లవారుజామునే లేచి భోగి మంటలను వేస్తారు.
ఇంట్లో ఉండే పాత వస్తువులు, చీపుర్లు తట్టలు, విరిగిపోయిన కట్టెలు, ఇతర వస్తువులు తీసుకొచ్చి భోగి మంట లలో వేస్తారు.ప్రస్తుత చలిని తట్టుకునేందుకు ప్రజలు భోగి మంటలు వేయడం చాలా సంవత్సరాల నుంచి సంప్రదాయంగా వస్తుంది.
భోగి మంటలను కేవలం వేచ్చదనం కోసమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా వేస్తూ ఉంటారు.భోగి పండుగ రోజు ఉదయాన్నే ఆవుపేడతో ఇంటిముందు కల్లాపు చల్లి రంగురంగుల ముగ్గులను వేస్తూ ఉంటారు.భోగిమంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలు, కర్రలు, ఇంట్లో పాత వస్తువులు వేస్తూ ఉంటారు.ఇలా చేయడం వల్ల మనలోని చెడును తగలబెట్టి మంచినట్లు పెంచాలని వేద పండితులు చెబుతున్నారు.
మంటలో ఆవు పిడకలు వాడడం వల్ల చలికి వ్యాపించే అనేక వ్యాధులు వ్యాపించకుండా గాలి కూడా శుద్ధి అవుతుందని చెబుతూ ఉంటారు.
శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వారికి ఈ గాలి ఎంతో మేలని కూడా ప్రజలు నమ్ముతారు.
ఇంకా చెప్పాలంటే భోగి మంట ల దగ్గర చిన్న పిల్లలు కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది.రేగు పండ్లను శ్రీమన్నారాయణ ప్రతిరూపంగా పెద్దలు చెబుతూ ఉంటారు.
ఇవి సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన ఫలం.ఈ పండ్లను చిన్నపిల్లల తలలపై పోయడం వల్ల సాక్షాత్తు శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహం పిల్లలపై ఉంటుందని పెద్దవారు చెబుతూ ఉంటారు.
LATEST NEWS - TELUGU