ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నరేష్ నాలుగో పెళ్లి గురించి చర్చ సాగుతోంది.మూడుసార్లు విజయవంతం కాని పెళ్లి నాలుగు సారి మాత్రం ఎలా ముందుకు వెళుతుంది అనేది సామాన్యుల ప్రశ్న ఇక మొదటి రెండు పెళ్లిళ్లలో విజయనిర్మల జోక్యం చేసుకొని దగ్గరుండి మరి సంబంధాలు చూసి వివాహం జరిపించారు.
విజయనిర్మల తన కొడుకు జీవితం ఎంతో చక్కగా ఉండాలని మొదటి నుంచి కోరుకున్నారు అందుకే ఆమె దగ్గరుండి సంబంధాలు చూసి మరి అమ్మాయి ఎంచుకున్నారు అలా మొదటిసారి కొరియోగ్రాఫర్ అయినటువంటి శ్రీనివాస్ కుమార్తెతో పెళ్లి చేశారు ఆవిడ.విజయనిర్మలకు, శ్రీనివాస్ కి మంచి అనుబంధం ఉండేది సినిమా ఇండస్ట్రీలో ఆవిడ దర్శకురాలిగా హీరోయిన్ గా నిర్మాతగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.
అప్పటికి నరేష్ హీరోగా ఎదిగాడు మంచి నటుడవుతాడని భావించి శ్రీనివాస్ కూడా విజయనిర్మల ఇచ్చిన ప్రపోజల్ ని ఒప్పుకొని తన కుమార్తెను నరేష్ కి ఇచ్చి పెళ్లి చేశాడు.కానీ కొన్నాళ్లకే నరేష్ ప్రవర్తనతో విసుకు చెందిన అతని మొదటి భార్య విడాకులు తీసుకుని ఆ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయి కన్నుమూశారు.
ఇక రెండో వివాహం కూడా విజయనిర్మల దగ్గరుండి జరిపించారు ఆమెకు అత్యంత సన్నిహితుడైనటువంటి ప్రముఖ గేయ రచయిత, అభ్యుదయ వాది అయిన దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి కుమారుడు సుబ్బారావు శర్మ కూతురు రేఖ సుప్రియ తో సంబంధం కుదుర్చుకున్నారు.

అయితే నరేష్ కి అది రెండో వివాహం రేఖకి మొదటి వివాహం కావడంతో సుబ్బరాయ శర్మ తొలుత ఆ వివాహానికి అస్సలు అంగీకరించలేదు.కానీ విజయనిర్మల రేఖ సుప్రియ ను తన ఇంటికి కోడలుగా పంపించాలని పట్టుబట్టారు.తానుండగా అతని కూతురికి ఎలాంటి అన్యాయం జరగదని హామీ కూడా ఇచ్చారట.
చిందర వందరగా ఉన్న నరేష్ జీవితంలోకి రేఖ సుప్రియ లాంటి ఒక ఉన్న వ్యక్తి వస్తే తన కొడుకు జీవితం బాగుపడుతుందని విజయ విమల ఆశపడ్డారు.అలా మొత్తానికి అందరినీ ఒప్పించి నరేష్ తో రేఖ వివాహం జరిపించారు.
అయినప్పటికీ నరేష్, రేఖ ల కొడుకు ఆటిజం సమస్యతో పుట్టగానే ఇద్దరు మధ్య గొడవలు రావడం ఆ తర్వాత ఆ విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకోవడం జరిగింది.ఇక ఆటిజం సమస్యతో బాధపడుతున్న కొడుకును మాత్రం రేఖ చాలా చక్కగా పెంచారు ప్రస్తుతం అతడు ప్రముఖ పెయింటర్ గా ఇండియాలోనే టాప్ లెవల్ లో ఉన్నాడు.







