ఇంటిని వాస్తు నియమాలను( Vastu ) అనుసరించి ఏ విధంగా అయితే నిర్మించుకోవాలో, అలాగే ఇంట్లో పెట్టుకునే వస్తువులను కూడా వాస్తు ప్రకారమే అమర్చుకుంటూ ఉండాలి.అంతే కాకుండా ఇంట్లో మెట్ల నిర్మాణం( Stairs ) సరైన దిశలో చేయడమే కాకుండా మెట్ల క్రింద పెట్టే వస్తువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.
లేదంటే దరిద్ర దేవత తిష్ట వేస్తుందని వాస్తు శాస్త్రా నిపుణులు చెబుతున్నారు.చాలామంది మెట్ల క్రింద ఖాళీగా ఉందని అక్కడ ఇంట్లో ఉపయోగించిన అనేక వస్తువులను పెడుతూ ఉంటారు.
మెట్ల కింద ఏమీ పెట్టొచ్చు, ఏమీ పెట్టకూడదు అనే సరైన జ్ఞానం లేకపోవడం వల్ల మెట్ల క్రింద స్థలాన్ని ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తూ ఉంటారు.దీనివల్ల దోషాలు కలుగుతాయి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న ప్రతి చిన్న పెద్ద వస్తువులు ఆ ఇంట్లోని వ్యక్తుల యొక్క ఆర్థిక, శరీరక, మానసిక పరిస్థితులపై శుభ, అశుభ ఫలితాలను ఇస్తుంది.చాలామంది ఇంట్లో స్థలం లేదని మెట్ల క్రింద వస్తువులను ఉంచుతూ ఉంటారు.మెట్లు తూర్పు దిశలో నిర్మించిన, మెట్ల క్రింద చెత్త చెదారం( Garbage ) జమా చేసిన ఆర్థిక నష్టంతో పాటు కుటుంబ కలహాలు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.ఇంకా చెప్పాలంటే మెట్ల కింద చేయకూడని కొన్ని పనుల్లో విషయానికి వస్తే పొరపాటున కూడా మెట్ల క్రింద టాయిలెట్ ( Toilet ) నిర్మించకూడదు.
స్టోర్ రూమ్ ఏర్పాటు చేయకూడదు.మెట్లు పొరపాటున కూడా ఉత్తరం, తూర్పు దిశ వైపు ఉండకూడదు.ఉత్తరం, తూర్పు దిశలో మెట్లు నిర్మించడం వల్ల ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి.ఇంకా చెప్పాలంటే మెట్ల క్రింద బూట్లు, చెప్పులు, ఇనుప వస్తువులు పెట్టకూడదు.అంతే కాకుండా పగిలిపోయిన ఫ్యామిలీ ఫోటోలు లేదా ఇంట్లో పాడైపోయిన వస్తువులు వంటివి మెట్ల కింద పెట్టకూడదు.ఇవన్నీ వాస్తు దోషాలుగా మారి కుటుంబంలో ఉద్రిక్తతకు కారణం అవుతాయి.
ఆర్థిక నష్టాలను, అనవసర కష్టాలను కలిగిస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే ఇలా మెట్ల క్రింద ఈ వస్తువులు ఉంటే మాత్రం దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్లే.
DEVOTIONAL