మహాశివరాత్రి రోజున పరమ శివుడి భక్తులు జాగరణ, ఉపవాసానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.శివుడికి నిష్టతో పూజలు కూడా భక్తులు చేస్తూ ఉంటారు.
ముసలి వాళ్లు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడేవారు, గర్భవతులు ఇలా ఏమైనా సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయలేకపోయినా ఏమీ కాదు.పరమేశ్వరుడి కరుణ కోసం భక్తులు మనస్ఫూర్తిగా పూజలు చేస్తూ ఉంటారు.
ఎంతో పవిత్రమైన శివరాత్రి రోజున శివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.శివపురాణంలో శివరాత్రి రోజు పూజా విధానాన్ని శ్రీకృష్ణుడికి ఉపమన్యు మహర్షి వివరించారు.ఆ రోజున పరమశివుడిని భక్తులు మూడు విధాలుగా పూజిస్తారు.ఇందులో శివ పూజా, ఉపవాసం, జాగారం లాంటి పరిహారాలు ఉంటాయి.
ఇంకా చెప్పాలంటే ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది.

ఉపవాసం చేసి శివనామ స్మరణ చేయడం చాలా ముఖ్యమైనది.ఉపవాసంలో శరీరక శుద్ధి, జాగారం చేస్తూ ధ్యానం చేయడం కారణంగా మనో శుద్ధి కలుగుతాయి.ఉపవాసం అంటే మనసును శివుడికి దగ్గరగా ఉంచడమే అని వేద పండితులు చెబుతున్నారు.
ఉపవాసం పాటించే ముందు రోజు ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు లాంటివి అస్సలు తినకూడదు.మద్యపానం అస్సలు చేయకూడదు.ఉపవాసం చేస్తాం, ఆకలి అవుతుంది కదా అనుకుని లేటుగా లేవకూడదు, అలా అసలు చేయకూడదు ఉపవాసం ఉండేవారు.

ఆరోగ్యపరంగా చూసిన ఉపవాసం శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది.నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయవద్దు.శరీరాన్ని కష్టపెడుతూ భగవంతుని వైపు మనసును తీసుకెళ్లడం కష్టం.
శివరాత్రి రోజున ఆ ప్రకృతిలోని శివశక్తిని శరీరం గ్రహించారంటే వెన్ను నిటారుగా పెట్టి ఉండడం మంచిది.ముఖ్యంగా శివరాత్రి రోజు ఇష్టమొచ్చినట్లు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసి జాగరణ అసలు చేయకూడదు.
జాగరణ చేసే ప్రతి క్షణం శివుని ఆరాధన లోనే ఉండాలి.