టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన( Rashmika Mandanna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప సినిమాతో( Pushpa ) పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.పుష్ప సినిమాతో ఈ ముద్దుగుమ్మకు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కడంతో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
కాగా రష్మిక మందన ఇప్పటికే పుష్ప2 షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది.ఈ మధ్యకాలంలో ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా రష్మికకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.
కాగా ప్రస్తుతం రష్మిక మందన ముంబై వీధుల్లో విహరిస్తోంది.ఈ క్రమంలోనే ముంబై వీధుల్లో( Mumbai ) ఎంజాయ్ చేస్తూ టోర్న్ జీన్స్ లో ట్రెండీగా దర్శనమిచ్చింది.
స్టైలిష్ గా కనిపిస్తూ యువత దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.కాగా ఒక ఫోటో షూట్ కోసం ముంబైకి వెళ్లిన రష్మిక కెమెరా కంటికి చిక్కారు.ఇక రష్మిక కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది.ఆమెకు వరుస ఆఫర్స్ దక్కుతున్నాయి.ఇకపోతే రష్మిక మందన నటించిన సీతారామం, ఆడవాళ్లు మీకు జోహార్లు డిజాస్టర్ కాగా, హిందీ చిత్రాలు గుడ్ బై, మిషన్ మజ్ను పుష్ప, వారసుడు సినిమాలు విడుదల అయినా విషయం తెలిసిందే.అయితే ఈ సినిమాలలో పుష్ప సినిమా తప్ప ఇతర సినిమాలు చెప్పుకోదగ్గ హిట్ ను సాధించలేకపోయాయి.
ఇది ఇలా ఉంటే ఇటీవల రష్మిక మందన రెండు సరికొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేసిన విషయం తెలిసిందే.నితిన్ కి జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తోంది.