సాధారణంగా కొందరు ఎన్ని సార్లు ముఖాన్ని వాటర్ తో క్లీన్ చేసుకున్నప్పటికీ మళ్లీ కొద్ది నిమిషాలకే చర్మం జిడ్డు జిడ్డుగా మారుతుంది.ఇలాంటి వారు మేకప్ వేసుకోవడానికి కూడా సంకోచిస్తుంటారు.
ఎందుకంటే జిడ్డు కారణంగా మేకప్ కొద్దిసేపటికి చెదిరిపోతుంది.అందుకే మేకప్ జోలికి పోనే పోదు.
ఇక చర్మం పై జిడ్డు పేరుకుపోవడం వల్ల తరచూ మొటిమలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి.అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీని కనుక పాటిస్తే చర్మం పై పేరుకు పోయిన అధిక జిడ్డును సులభంగా తొలగించుకోవచ్చు.
అలాగే ఎక్కువ సమయం పాటు చర్మాన్ని గ్లోయింగ్‌గా మెరిపించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
సాధారణంగా గుడ్డు పెంకులను అందరూ బయట పారేస్తుంటారు.అయితే గుడ్డు పెంకులు కూడా మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంటాయి.ముఖ్యంగా చర్మం పై పేరుకు పోయిన అధిక జిడ్డును తొలగించడానికి అద్భుతంగా సహాయపడతాయి.అందు కోసం కొన్ని గుడ్డు పెంకులు తీసుకుని వాటర్ లో శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి.
ఆ తర్వాత వాటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న గుడ్డు పెంకుల పౌడర్ లో ఒక ఎగ్ వైట్ ను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకుని.అప్పుడు వేళ్ళతో సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఈ విధంగా చేస్తే చర్మంపై పేరుకుపోయిన జిడ్డు, మురికి, మృత కణాలు తొలగిపోతాయి.
చర్మం ఎక్కువ సమయం పాటు తాజాగా మరియు కాంతివంతంగా మెరుస్తుంది.కాబట్టి ఆయిలీ స్కిన్ సమస్యతో సతమతం అయ్యేవారు తప్పకుండా గుడ్డు పెంకులతో పైన చెప్పిన రెమెడీని పాటించేందుకు ప్రయత్నించండి.