బంగ్లాదేశ్ అత్యంత‌ కాలుష్య దేశంగా మార‌డానికి కార‌ణ‌మిదే!

ప్రపంచంలోని అత్యంత కాలుష్యపూరిత‌ నగరాల్లో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.స్విస్ సంస్థ త‌న ఎయిర్ సర్వేలో ఈ ప్ర‌క‌ట‌న చేసింది.

 Why Bangladesh Air Worst In The World ,who , Bangladesh , Air Pollution, The-TeluguStop.com

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రమాణాలపై 117 దేశాల్లోని 6,475 నగరాల్లో నిర్వహించిన సర్వేలో ఈ ఫలితాలు ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి.బంగ్లాదేశ్ ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా ఉండటానికి ప్రధాన కారణాలు అనేకం ఉన్నాయి.

ది డైలీ స్టార్ నివేదిక ప్రకారం.కాలుష్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు మించి బంగ్లాదేశ్‌లో కాలుష్యం 15 రెట్లు అధికంగా ఉంది.

ఇక్కడ కాలుష్యానికి అతి పెద్ద కారణం వాహనాలు, ఇటుక బట్టీలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ.ఇంతేకాకుండా నగరాల్లోని దుమ్ము కూడా కాలుష్యానికి పెద్ద కారణంగా నిలిచింది.గాలిలో కాలుష్యం కలిగించే సూక్ష్మ కణాలు పీఎం2.5.

ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివ‌రాల ప్రకారం గాలిలోని ఈ కణాలు 5 µg/m3 మించకూడదు.కానీ బంగ్లాదేశ్‌లో ఇది క్యూబిక్ మీటరుకు 76.9 మైక్రోగ్రాములు (µg/m3)గా ఉన్నాయి.గాలిలో ఉండే ఈ కణాల పరిధి అంత‌కంత‌కూ పెరుగుతోంది.

స్విస్ సంస్థ అధికారిక వెబ్‌సైట్ తెలిపిన వివ‌రాల‌ ప్రకారం, ఢిల్లీ తర్వాత ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢాకా రెండవ స్థానంలో ఉంది.ఢిల్లీలో పీఎం2.5 స్థాయి 85.0 µg/m3గా, ఢాకాలో ఈ సంఖ్య 78.1 µg/m3గా ఉంది.గతేడాది కూడా బంగ్లాదేశ్ కాలుష్య దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది.

ఈ నివేదిక ప్రకారం బంగ్లాదేశ్‌లో కాలుష్య స్థాయి పెరగడం వల్ల అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఛాతీ ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం పొంచివుంది.ఇంతేకాకుండా ఇన్ఫ్లుఎంజా, న్యుమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు కూడా పెరిగింది.

అదే సమయంలో పిల్లల్లో కాలుష్య ప్రభావం వారి శారీరక ఎదుగుదలపై తీవ్ర‌ ప్రభావం చూపుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube