చిరంజీవి వీవీ వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఠాగూర్ సినిమా( Tagore Movie ) అప్పట్లో అంచనాలకు మించి విజయం సాధించింది.తమిళ సినిమా రమణకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కగా ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ జనరేషన్ ప్రేక్షకులు సైతం ఈ సినిమాను ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.ఈ సినిమా విడుదలై నిన్నటికి 20 సంవత్సరాలు కావడం గమనార్హం.
వాస్తవానికి తమిళంలో తెరకెక్కిన రమణ మూవీలో ఎలాంటి కమర్షియల్ సీన్స్ ఉండవు.క్లైమాక్స్ లో హీరో చనిపోతాడు.ఈ సినిమా తెలుగు వెర్షన్ లో హీరో చనిపోతే నిర్మాత చనిపోయినట్టే అని స్నేహితుని సూచన ప్రకారం చిరంజీవి భావించారు.ఈ సినిమాలో మార్పులుచేర్పులకు మురుగదాస్ అంగీకరించకపోవడంతో వినాయక్ కు ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కింది.
చిరంజీవికి వీరాభిమాని అయిన వినాయక్( VV Vinayak ) ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించి ఠాగూర్ సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు.ఈ సినిమా విడుదలైన సమయంలో మొదట డివైడ్ టాక్ వచ్చింది.
భారతీయుడులా ఈ సినిమా ఉందని కొంతమంది కామెంట్ చేయగా ఆ తర్వాత ఈ సినిమా హిట్టైంది.తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం అనే డైలాగ్ ఈ మూవీకి హైలెట్ గా నిలిచింది.
ఈ సినిమా 253 కేంద్రాల్లో 50 రోజుల పాటు ప్రదర్శితం కాగా ఈ రికార్డ్ ను అందుకున్న తొలి తెలుగు సినిమా ఠాగూర్ కావడం గమనార్హం.ఈ సినిమాలోని నేను సైతం క్లైమాక్స్ సాంగ్ కు జాతీయ అవార్డ్ వచ్చింది.ఈ సినిమాలో బాల నటులుగా తేజ సజ్జా, కావ్య కళ్యాణ్ రామ్ నటించగా వాళ్లిద్దరికీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది.ఈ సినిమాలో వినాయక్ స్టూడెంట్ రోల్ లో కనిపించి మెప్పించారు.