ఇటీవల రోజుల్లో పురుషులను బాగా కలవర పెడుతున్న సమస్యల్లో బట్టతల ( Baldness )ఒకటి.ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే బట్టతల కనిపించేది.
కానీ ఇటీవల రోజుల్లో పాతిక ముప్పై ఏళ్లకే చాలా మంది పురుషులు బట్టతలతో బాధపడుతున్నారు.బట్టతలను కవర్ చేసుకునేందుకు ముప్ప తిప్పలు పడుతున్నారు.
అయితే బట్ట తల వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.అందుకు ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.

నెలలో కనీసం రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే పురుషులకు బట్టతల భయమే అక్కర్లేదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో పావు కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్, వన్ టేబుల్ స్పూన్ డ్రై రోజ్ మేరీ ఆకులు, రెండు రెబ్బలు కరివేపాకు( Curry leaves ) వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ఆకులు వేసి మరిగించాలి.
వాటర్ సగం అయ్యేంతవరకు హీట్ చేసి ఆపై స్టవ్ ఆఫ్ చేయాలి.ఇలా మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆమ్లా పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు మందారం పౌడర్( Hibiscus Powder ) వేసుకోవాలి.అలాగే తయారు చేసి పెట్టుకున్న వాటర్ ను కొంచెం కొంచెం గా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి పట్టించాలి గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి లేదా కనీసం నెలకు రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.బట్టతల వచ్చే రిస్క్ తగ్గుతుంది.జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.అలాగే ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు సమస్య( Dandruff ) కూడా నయం అవుతుంది.
కాబట్టి బట్టతలకు దూరంగా ఉండాలి అనుకునే పురుషులు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.







