మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ సినిమాకు మాత్రమే సొంతమైన ఈ రేర్ రికార్డ్ గురించి మీకు తెలుసా?

చిరంజీవి వీవీ వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఠాగూర్ సినిమా( Tagore Movie ) అప్పట్లో అంచనాలకు మించి విజయం సాధించింది.

తమిళ సినిమా రమణకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కగా ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ జనరేషన్ ప్రేక్షకులు సైతం ఈ సినిమాను ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా విడుదలై నిన్నటికి 20 సంవత్సరాలు కావడం గమనార్హం. """/" / వాస్తవానికి తమిళంలో తెరకెక్కిన రమణ మూవీలో ఎలాంటి కమర్షియల్ సీన్స్ ఉండవు.

క్లైమాక్స్ లో హీరో చనిపోతాడు.ఈ సినిమా తెలుగు వెర్షన్ లో హీరో చనిపోతే నిర్మాత చనిపోయినట్టే అని స్నేహితుని సూచన ప్రకారం చిరంజీవి భావించారు.

ఈ సినిమాలో మార్పులుచేర్పులకు మురుగదాస్ అంగీకరించకపోవడంతో వినాయక్ కు ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కింది.

చిరంజీవికి వీరాభిమాని అయిన వినాయక్( VV Vinayak ) ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించి ఠాగూర్ సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు.

ఈ సినిమా విడుదలైన సమయంలో మొదట డివైడ్ టాక్ వచ్చింది.భారతీయుడులా ఈ సినిమా ఉందని కొంతమంది కామెంట్ చేయగా ఆ తర్వాత ఈ సినిమా హిట్టైంది.

తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం అనే డైలాగ్ ఈ మూవీకి హైలెట్ గా నిలిచింది.

"""/" / ఈ సినిమా 253 కేంద్రాల్లో 50 రోజుల పాటు ప్రదర్శితం కాగా ఈ రికార్డ్ ను అందుకున్న తొలి తెలుగు సినిమా ఠాగూర్ కావడం గమనార్హం.

ఈ సినిమాలోని నేను సైతం క్లైమాక్స్ సాంగ్ కు జాతీయ అవార్డ్ వచ్చింది.

ఈ సినిమాలో బాల నటులుగా తేజ సజ్జా, కావ్య కళ్యాణ్ రామ్ నటించగా వాళ్లిద్దరికీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది.

ఈ సినిమాలో వినాయక్ స్టూడెంట్ రోల్ లో కనిపించి మెప్పించారు.

సొరచేప నోటి కాడి ఫుడ్ లాగేసిన మనుషులు.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..?