ఈ మధ్య కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు, వెయిట్ లాస్ అయ్యేందుకు, బ్లడ్ షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకునేందుకు చాలా మంది బ్రౌన్ రైస్(దంపుడు బియ్యం)నే ఎంచుకుంటున్నారు.వైట్ రైస్‌తో పోలిస్తే బ్రౌన్ రైస్‌లో స్టార్చ్ కంటెంట్ తో పాటు కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి.
ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి.అందుకే ఆరోగ్య నిపుణులు కూడా బ్రౌన్ రైస్ తీసుకోమని సూచిస్తున్నారు.
అయితే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మాత్రమే కాదు.చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలోనూ గ్రేట్‌గా సహాయపడుతుంది.
మరి బ్రౌన్ రైస్‌ను చర్మానికి ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా బ్రౌన్ రైస్ తీసుకుని మెత్తగా పిండి చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్‌లో బ్రౌన్ రైస్ పిండి, నిమ్మ రసం మరియు కీర దోస రసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి.
ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం చల్లటి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారంలో రెండు సార్లు చేయడం వల్ల ముఖంపై డార్క్ స్పాట్స్ దూరం అవుతాయి.మరియు చర్మ ఛాయ పెరుగుతుంది.
అలాగే ముడతలను తగ్గించడంలోనూ బ్రౌన్ రైస్ ఉపయోగపడుతుంది.
ఒక బౌల్‌లో బ్రౌన్ రైస్ పిండి, పెరుగు మరియు తేనె వేసి కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకుని.అర గంట పాటు వదిలేయాలి.
ఇప్పుడు గోరు వెచ్చని నీటితో ఫేష్ వాష్ చేసుకోవాలి.ఇలా డే బై డే చేస్తూ ఉంటూ ముడతలు మటుమాయం అవుతాయి.
ఇక ఒక గిన్నెలో బ్రౌన్ రైస్ పిండి మరియు పాలు వేసి మిక్స్ చేసుకుని.ముఖానికి పూసుకోవాలి.పావు గంట పాటు డ్రై అవ్వనిచ్చి.అనంతరం కొద్దిగా నీళ్లు జల్లి వేళ్లతో మెల్ల మెల్లగా రుద్దుకుంటూ శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తే.చర్మంపై పేరుకుపోయి ఉన్న దుమ్ము, ధూళి పోయి ముఖం కాంతివంతంగా, అందంగా మారుతుంది.