బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం ఆదివారం ఎంతో ఘనంగా ముగిసింది.ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే ఎంతో అంగరంగ వైభవంగా ముగియగా ఈ కార్యక్రమంలో శ్రీహన్ రన్నర్ కాగా, రేవంత్ విన్నర్ అయ్యాడు.
ఇక శ్రీహాన్ రెండవ స్థానంలో ఉన్నప్పటికీ ఈయన బిగ్ బాస్ ఆఫర్ చేసిన 40 లక్షల తీసుకొని బయటకు వచ్చారు.ఇక రేవంత్ ట్రోఫీతో పాటు పదిలక్షల ప్రైజ్ మనీ సువర్ణభూమి ల్యాండ్ అలాగే ఒక బెజ్రా కారును సొంతం చేసుకున్నారు.
అయితే శ్రీహన్ ఈ కార్యక్రమంలో 40 లక్షల తీసుకొని బయటకు రావడంతో కొందరు ఈ విషయంపై విమర్శలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే టాప్ ఫోర్ కంటెస్టెంట్ గా ఉన్నటువంటి ఆదిరెడ్డి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.మీరు కూడా డబ్బు తీసుకొని బయటకు వస్తారని అనుకున్నాము అంటూ ఆయనను ప్రశ్నించగా తాను ఒకసారి మాట ఇస్తే మాటపై నిలబడతానని కోటి రూపాయలు ఆఫర్ చేసిన తాను తీసుకొనని తెలిపారు.
ఎందుకంటే అది విన్నింగ్ ప్రైజ్ మనీ మనం తీసుకున్నప్పుడు విన్నర్ కి అన్యాయం జరుగుతుంది.

ఇక శ్రీహాన్ ఈ కార్యక్రమంలో 40 లక్షలు తీసుకున్నారు అయితే మనకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఆ డబ్బు తీసుకోవడం తప్పు లేదని తన అభిప్రాయాన్ని తెలియజేశారు.శ్రీహాన్ కూడా ఎంతో కష్టపడి ఆడుతూ రెండవ స్థానంలోకి వచ్చారు అంతేకాకుండా తనకు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని పలుసార్లు తన దగ్గర ప్రస్తావించారని అందుకోసమే శ్రీహాన్ ఆ డబ్బు తీసుకున్నారని ఆదిరెడ్డి తెలిపారు.ఇలా కష్టపడి రెండో స్థానంలోకి వచ్చి ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల శ్రీహాన్ ఆ డబ్బు తీసుకోవడంలో తప్పు ఏమాత్రం లేదనేది తన అభిప్రాయమని ఆదిరెడ్డి తెలిపారు.







