దేశవ్యాప్తంగా టమాటా(Tomato) ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.కేజీ టమాటా దాదాపు 100 నుండి 130 రూపాయల ధర పలుకుతుంది.
దీంతో దేశవ్యాప్తంగా ఉన్న టమాటా రైతులు భారీ ఎత్తున లాభాలు సంపాదిస్తున్నారు.ఇదే సమయంలో అధిక ధరల దృష్ట్యా టమాటా లారీలు చోరీలకు కూడా గురవుతున్నాయి.
ఇదిలా ఉంటే కొమరం భీమ్ ఆసిఫాబాద్( Komarambhim district ) జిల్లా వాంకిడి మండలంలోని సామెల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం టమాటా లోడుతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది.
కర్ణాటక( Karnataka ) నుంచి చంద్రపూర్ కు వెళ్తున్న ఏపీ39 డబ్ల్యూ 4479 నెంబరు గల వ్యాన్ ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయే అదుపుతప్పి బోల్తా పడింది.
టమాటా వ్యాన్ బోల్తా పడిన విషయం స్థానికులు చుట్టుపక్కల గ్రామస్తులు తెలుసుకోవడంతో భారీ ఎత్తున ప్రజలు.పరుగులు తీసి వ్యాన్ వద్దకు చేరుకున్నారు.దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే టమాటా వ్యాన్ బోల్తా పడిన దగ్గరకు చేరుకొని ఎవరిని రానివ్వకుండా.పడిపోయిన టమాటాలు చుట్టూ కాపలా కాయడం జరిగింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్ కి స్వల్ప గాయాలు అయ్యాయి.







