ఇంటి ముందు ఇటువంటి చెట్లు ఉన్నాయా.. అయితే మీకు ధన నష్టంతో పాటు దరిద్రమే..

సాధారణంగా మన ఇంటి చుట్టూ అలాగే ఇంటి పరిసర ప్రాంతాలలో ఎన్నో రకాల మొక్కలు చెట్లను పెంచుతూ ఉంటాము.అయితే ఇందులో కొన్ని రకాల మొక్కలను వాస్తు ప్రకారం మన పెరట్లో నాటుతూ ఉంటాము.

 Do You Have Such Trees In Front Of The House But You Will Be Poor Along With Its-TeluguStop.com

మరికొన్ని మొక్కలు తెలిసి తెలియక పెంచుతూ ఉంటాము.అయితే కొన్ని రకాల మొక్కలు ఆర్థిక సమస్యలను దూరం చేస్తే, మరికొన్ని మొక్కలు ఆర్థిక సమస్యలను తీసుకురావడంతో పాటు దరిద్రం వెంటపడేలా చేస్తాయి.

ఒకవేళ మీ ఇంటి చుట్టూ కీడు కలిగించే చెట్లు ఉంటే వెంటనే వాటిని తొలగించడం మంచిది.

మరి ఇంటి ఆవరణలో ఎటువంటి మొక్కలు, చెట్లు ఉండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటి పరిసర ప్రాంతాలలో కాక్టాస్ మొక్కలను నాటకూడదు.చాలా మంది వీటిని అలంకరణ కోసం నాటుతూ ఉంటారు.

కానీ ఈ మొక్కను ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచడం వల్ల బాధలు ఇంట్లో చికాకులు లాంటి సమస్యలు వస్తాయి.ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఉద్రిక్త వాతావరణం నెలకొని కలహాలు, గొడవలు వస్తూ ఉంటాయి.

అంతేకాకుండా ఇంటి వాతావరణం ఆవరణలో తుమ్మ చెట్టు అస్సలు ఉండకూడదు. తుమ్మ చెట్టు ఉండడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.అంతేకాకుండా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.అయితే ఇంటి పరిసర ప్రాంతాల్లో రేగు చెట్టు ఉంటే కష్టాలు పెరిగే అవకాశం ఉంది.

రేగు చెట్టులో ఉండే ముళ్ళు కారణంగా ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది.ఆర్థిక సంక్షోభం మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.అంతేకాకుండా ఇంట్లో లక్ష్మీ దేవత కొలువై ఉండదు.ఇంటిదగ్గర నిమ్మ, ఉసిరి చెట్లు లేకుండా చూసుకోవడం మంచిది.

ఇంట్లో ఎటువంటి మొక్కలు ఉండాలి అన్న విషయానికి వస్తే మనీ ప్లాంట్, తుజా మొక్క, కుబేరాక్షి మొక్కలు ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.ఈ మొక్కలు ఇంటికి అదృష్టాన్ని తెచ్చి పెట్టడంతో పాటు ఇంట్లో ఎప్పుడూ సానుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube