ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.37
సూర్యాస్తమయం: సాయంత్రం.6.23
రాహుకాలం: మ.12.00 ల1.30
అమృత ఘడియలు: ఉ.9.36 ల10.00
దుర్ముహూర్తం: ఉ.11.36 మ12.34
మేషం:

ఈరోజు మీకు కొన్ని విషయాలు అనుకూలంగా ఉండవు.విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.అనుకోకుండా కొన్ని విజయాలు దక్కుతాయి.కొన్ని సంతోషకరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.అనవసరమైన గొడవలకు వెళ్లకపోవడం మంచిది.లేదా దీని వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి.
వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని పనులు పూర్తిగా విజయవంతం అవుతాయి.దీని వల్ల మంచి ఫలితాలు వస్తాయి.మీ జీవితం మనశ్శాంతిగా ఉంటుంది.కొన్ని ఒప్పందాల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.అనుకోకుండా మీ ఇంటికి వచ్చిన అతిధి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి.మంచి ఆలోచనల వల్ల కొన్ని విషయాలు పూర్తి అవడానికి అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు.మీ పిల్లల నుండి మంచి వార్తలు వింటారు.జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది.దీనివల్ల ఈరోజు సంతోషంగా గడుపుతారు.
కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాన్ని చూస్తారు.కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.అనవసరంగా ఇతరులతో గొడవలకు దిగకపోవడం మంచిది.దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.మీ సంతాన విషయం లో జాగ్రతలు తీసుకోవాలి.ఇతరులతో సంబంధాలు పెట్టుకోకుండా ఉండటం మంచిది.
సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.మీ ఆరోగ్య విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.మీ ఆవేశం వల్ల ఇతరులతో గొడవలకు దిగుతారు.మీ కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.
కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.మీ వ్యాపార రంగంలో అభివృద్ధి ఉంటుంది.మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.మీరు పనిచేసే చోట మీకు సలహాలు ఉండడంవల్ల అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిధి వల్ల సంతోషంగా గడుపుతారు.
తుల:

ఈరోజు ఆర్థికంగా కొంత వరకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవడంతో ప్రశంసలు అందుతాయి.అనవసరమైన గొడవలకు దిగకపోవడం మంచిది.
లేదా దీని వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి.కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల సంతోషంగా ఉంటారు.
వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఖర్చులు ఉంటాయి.మీ ఆరోగ్య విషయం అనుకూలంగా ఉండదు.ఆర్థికంగా మీ కుటుంబ సభ్యులు సాయపడతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉంది.కానీ కొన్ని పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి.మీ మిత్రుల నుండి సహాయం అందుతుంది.
ధనుస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.దీనివల్ల కొన్ని పనులు పూర్తవుతాయి.మీరు పనిచేసే చోట మీకు ప్రశంసలు అందుతాయి.దీని వల్ల విజయం దక్కుతుంది.మీ కుటుంబ సభ్యులతో ఈరోజు సంతోషంగా గడుపుతారు.మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఖర్చు పెరుగుతుంది.వ్యాపార విషయంలో లాభాలు అందుతాయి.
ఒక మంచి శుభవార్త వింటారు.దీనివల్ల ఆనందంగా ఉంటారు.
మీరు పనిచేసే చోట మీకు విజయాలు అందుతాయి.దీనివల్ల ఈరోజు సంతోషంగా గడుస్తుంది.
కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీ వ్యక్తిత్వం వల్ల మీకు గౌరవం దక్కుతుంది.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.మీ వ్యక్తిత్వం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని శుభ వార్తలు వింటారు.మీ వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంది.మీ మీద ఉన్న బాధ్యత తీరిపోతుంది.దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.కొన్ని ప్రయాణాలు అనుకూలం గా ఉన్నాయి.
ఈరోజు మీ స్నేహితుల వల్ల సంతోషంగా గడుపుతారు.