క్యాన్సర్ వ్యాధి ని పెంచే 26 ఔషధాలను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం..

కోవిడ్ వైరస్ వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.ఈ వ్యాధి వచ్చి తగ్గిన తర్వాత ప్రపంచ ప్రజలలో ఆరోగ్యం పై శ్రద్ధ పెరిగింది.

జ్వరం, తలనొప్పి లాంటివి వస్తే స్వయంగా జనాలే టాబ్లెట్లను తీసుకుంటున్నారు.ఇలాంటి టాబ్లెట్లను తీసుకున్నప్పుడు జ్వరం తలనొప్పి లాంటివి అప్పటికప్పుడు తగ్గినా వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది.

క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రజల ఆరోగ్యంపై ఇలాంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న ఔషధాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.

యాంటసిడ్‌ సాల్ట్‌ రానిటిడైన్‌ను ఔషధాల జాబితా నుంచి తొలగించింది.మంగళవారం రోజు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 384 ఔషధాలు ఉన్న ఒక కొత్త జాబితాను విడుదల చేసింది.

Advertisement

ఈ జాబితాలో నిషేధించబడిన 26 ఔషధాలు ఇప్పటినుంచి మన దేశంలో అందుబాటులో ఉండవు అని తేల్చి చెప్పింది.క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన రానిటిడిన్ లాంటి ఔషధం ప్రపంచవ్యాప్తంగా పరిశీలనలో ఉంది.

ఈ ఔషధం ప్రజలకు హానికరమని కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటివరకు ఉన్న స్టాక్ నుండి ఔషధాన్ని బయటకి తీయడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా తో చర్చలు జరుగుతుంది.దీనివల్ల మన దేశంలో ఎక్కువగా డిమాండ్ ఉండే ఔషధాలు అయినా ఇన్సులిన్ గ్లార్జిన్ తో పాటు చాలా ఔషధాల ధరలు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు అంచనా.కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ఆ 26 ఔషధాలు వరుసగా నికోటినామైడ్, పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2a, పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2b,పెంటమిడిన్,ప్రిలోకైన్ (A) + లిగ్నోకైన్ (B),ప్రోకార్బజైన్,రానిటిడిన్,రిఫాబుటిన్, స్టావుడిన్ (ఎ) + లామివుడిన్ (బి), సుక్రాల్‌ఫేట్,వైట్ పెట్రోలేటం,ఆల్టెప్లేస్,అటెనోలోల్,బ్లీచింగ్ పౌడర్,కాప్రోమైసిన్, సెట్రిమైడ్,క్లోర్ఫెనిరమైన్,డిలోక్సనైడ్ ఫ్యూరోయేట్,డిమెర్కాప్రోల్, ఎరిత్రోమైసిన్ ,ఇథినైల్స్ట్రాడియోల్,ఇథినైల్‌స్ట్రాడియోల్(A) నోరెథిస్టిరాన్ (B),గాన్సిక్లోవిర్,కనామైసిన్,లామివుడిన్ (ఎ) + నెవిరాపైన్ (బి) + స్టావుడిన్(సి),లెఫ్లునోమైడ్,మిథైల్డోపా ఈ ఔషధాలను మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.

Advertisement

తాజా వార్తలు