స్టార్ హీరో బాలయ్యకు( Balakrishna ) కోపం ఎక్కువని చాలామంది భావిస్తారు.బాలయ్య ఎన్నికల ప్రచారంలో సైతం కొంతమందిపై చేయి చేసుకోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
అయితే ప్రముఖ నటుడు సమీర్( Sameer ) బాలయ్య సెట్స్ లో ఎంత సరదాగా ఉంటారో చెప్పుకొచ్చారు.తన భార్యకు ఫోన్ చేసి బాలయ్య ఇరికించారని సమీర్ వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
ఒక సినిమా షూటింగ్ సమయంలో బాలయ్య నా భార్య ఫోన్ నంబర్ అడిగారని నా భార్య ఫోన్ నంబర్ ను బాలయ్య ఎందుకు అడుగుతున్నారో అర్థం కాక టెన్షన్ పడ్డానని సమీర్ కామెంట్లు చేశారు.నేను ఫోన్ కలిపి ఇస్తానని చెప్పినా బాలయ్య వినలేదని ఆ తర్వాత కంగారు పడుతూనే ఫోన్ నంబర్( Phone Number ) ఇచ్చానని సమీర్ పేర్కొన్నారు.
ఆ తర్వాత బాలయ్య ఫోన్ కాల్ లో సమీర్ సెట్ కు రాలేదని ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని సమీర్ కోసం అందరూ ఎదురుచూస్తున్నామని చెప్పారట.
సమీర్ గురించి మీకు తెలుసేమో అని మీ ఫోన్ నంబర్ తెలుసుకుని కాల్ చేస్తున్నానని ఆయన సమీర్ భార్యతో( Sameer Wife ) అన్నారట.సమీర్ రాకపోతే షూటింగ్ కు ప్యాకప్ చెప్పే పరిస్థితి ఉంటుందని కామెంట్ చేశారట.ఆ తర్వాత నా భార్య నా ఫోన్ కు కాల్ చేస్తుంటే ఆ ఫోన్ కూడా తన దగ్గర పెట్టుకుని బాలయ్య కాల్స్ కట్ చేశాడని నా భార్య పంపించిన మెసేజ్ లు సెట్ లో అందరిముందు చదివాడని సమీర్ చెప్పుకొచ్చారు.
కొన్ని గంటల తర్వాత బాలయ్య మళ్లీ నా భార్యకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పారని అప్పుడు నా భార్య కూల్ అయిందని సమీర్ వెల్లడించారు.ఈ విషయాలు తెలిసిన నెటిజన్లు బాలయ్యలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.బాలయ్య ప్రస్తుతం బాబీ సినిమాతో బిజీగా ఉన్నారు.