దర్శకుడు రాజమౌళి( Director Rajamouli ) జీవితం అందరికి తెలిసిన పుస్తకమే.ఆయన వ్యక్తిగత జీవితం వృత్తి గత జీవితం గురించి ఎవరికి తెలియని విషయాలు అంటూ ఉండవు.
పైగా దాచుకోవాలని కూడా ఏరోజు రాజమౌళి ప్రయత్నించడు.ఏది ఉన్న మీడియా ముందు చెప్పే అలవాటు ఉంటుంది ఆయనకు.
అయితే రాజమౌళి రమ ను( Rama ) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.వారికి కార్తికేయ,( Karthikeya ) మయూఖ( Mayukha ) అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఇది అందరికీ తెలిసిందే.అయితే ఈ ఇద్దరు పిల్లలు రాజమౌళికి పుట్టలేదు.
కార్తికేయ రమ కు తన మొదటి భర్త ద్వారా జన్మించగా మయూఖ ను దత్తత తీసుకున్నారు.
అయితే రాజమౌళి పిల్లలను కనగలిగే స్థితిలో ఉండి కూడా ఎందుకు మయూఖ ను దత్తత తీసుకున్నారు అనేది చాలామందికి అంతు పట్టని ప్రశ్న.కార్తికేయ ఎలాగూ రమ కు తన మొదటి సంతానం ద్వారా జన్మించాడు.ఆ తర్వాత పిల్లల్ని కనొచ్చు కదా ఎందుకు దత్తత తీసుకోవాల్సి వచ్చింది అనేది చాలామంది సోషల్ మీడియాలో చర్చిస్తూ ఉంటారు.
అందుకు ఈ మధ్యకాలంలో రాజమౌళి ఓ మీడియా వేదికగా సమాధానం ఇచ్చారు.రమా కార్తికేయ పుట్టిన తర్వాత తన భర్త ఎక్కువగా మధ్యానికి బానిస అయ్యి ఆమెను హింసిస్తూ ఉండడంతో తన అక్క అయిన వల్లి( Valli ) ఇంటికి వచ్చేసింది.
ఏడాది పాటు అతడిలో మార్పు వస్తుంది అని ఎదురు చూసినా ఎలాంటి ఫలితం దక్కకపోవడంతో విడాకులు తీసుకుంది.
అయితే రాజమౌళి కన్నా రమ నాలుగేళ్లు పెద్దది కూడా.అయినా కూడా రమపై ఉన్న అభిమానంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఎక్కడ పిల్లలు పుడితే మళ్ళీ కార్తికేయను ప్రేమించలేనేమో అని భయపడేవాడట.తనకు సొంత పిల్లలు గనక ఉంటే ఖచ్చితంగా వారిపై ఎక్కువ ప్రేమ చూపించాల్సి వస్తుంది కాబట్టి కార్తికేయ కోసం పిల్లల్ని కనకుండా మయూఖ ను దత్తత తీసుకున్నారు.
అందుకే రాజమౌళి రమ పై ఉన్న అభిమానం కొద్ది ఇంత పెద్ద త్యాగం చేశాడు.ఈ రోజుల్లో ఇలాంటి వారు ఎక్కడ ఉండరు.మామూలుగానే ఆయనను సినిమాల విషయంలో అందరూ రెస్పెక్ట్ ఇస్తారు.కానీ ఈ విషయాలు తెలిసిన తర్వాత ఆయనపై మరింత రెస్పెక్ట్ పెరిగింది.