ఈ మధ్యకాలంలో చిన్న పని చేసి అలసిపోయినప్పుడు శరీరానికి చెమట పడుతూ ఉంటుంది.వేసవికాలంలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంటుంది.
మరోవైపు మధుమేహం అనేది ప్రపంచం మొత్తం ఎదురుకుంటున్న ముఖ్యమైన సమస్యగా మారిపోయింది.మధుమేహంపై ఎప్పటికప్పుడు పరిశోధనలను శాస్త్రవేత్తలు జరుపుతూ ఉన్నారు.
ప్రస్తుతం మరో కొత్త విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
అధికంగా చెమట పట్టడానికి మధుమేహం వ్యాధికి మధ్య సంబంధం ఉందని వెల్లడించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గుణాంకాల ప్రకారం ప్రపంచంలో 42 మిలియన్లకు పైగా ప్రజలు మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు దీనితోపాటు మధుమేహం కారణంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రతి సంవత్సరం దాదాపు 15 లక్షల మంది మరణిస్తున్నారు.ప్రపంచంలోని మొత్తం మధుమేహ బాధితులలో 17 శాతం మంది భారతదేశంలో ఉండడం ఆవేదన కలిగించే విషయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ గుణాంకాలు 2045 నాటికి భారత దేశంలో 13.5 కోట్ల మధుమేహం వ్యాధిగ్రస్తులు ఉంటారని వెల్లడిస్తున్నాయి.చక్కెర వ్యాధి లక్షణాలలో చెమట పట్టడం లేదు కానీ ఈ మధుమేహం తర్వాత చాలామందిలో చెమట సమస్య కనిపిస్తూ ఉంది.డయాబెటిస్ లో శరీరం దాని సహజ ఉష్ణోగ్రతను నిర్వహించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
దీని కారణంగా తల తిరగడం, చెమట పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.రాత్రిపూట కూడా చెమట పడుతుంది అంటే అది ఆందోళన కలిగించే విషయమే.
రక్తంలో చక్కెర లెవెల్స్ బ్యాలెన్స్ గా లేనప్పుడు అధికంగా చెమట పడుతుంది.కొంతమందికి పాదాలు లేదా తొడలలో చమట ఎక్కువగా పడుతుంది.

ఒక పరిశోధన ప్రకారం మధుమేహంతో బాధపడుతున్న వారిలో 84 శాతం మంది అధిక చమట తో బాధపడుతున్నారు.రక్తంలో చక్కెర శాతం తగ్గడమే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు.రక్తంలో చక్కెరను తగ్గించడానికి మందులు తీసుకుంటూ ఉంటారు.ఈ ఔషధం తీసుకోవడం వల్ల చక్కెర శాతం వేగంగా తగ్గిపోవడం మొదలవుతుంది.మధుమేహం కారణంగా చక్కెర పూర్తిగా మానేస్తారు.శరీరంలో చక్కెర లేదా గ్లూకోస్ కొరత ఏర్పడినప్పుడు ఎక్కువ చెమట పడుతుంది.
కాబట్టి చెమట పట్టడం కూడా తెలియగా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.