ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే ఒక భాషలో తెరికెక్కిన సినిమాలు ఇతర భాషలలో కూడా విడుదలవుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇక కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఏకంగా తెలుగు డైరెక్టర్ లతో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇప్పటికే విజయ్ దళపతి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన వారసుడు సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదలైంది.
ఈ క్రమంలోనే మరొక స్టార్ హీరో ధనుష్ సైతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే సినిమా ద్వారా ఫిబ్రవరి 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమాలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ స్ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు.తెలుగులో సార్ పేరిట ఈ సినిమా విడుదల కాగా తమిళంలో వాతి పేరుతో విడుదల కానుంది.
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హీరో ధనుష్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

హైదరాబాద్ లోని ఏఎంబీ స్ లో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా ధనుష్ మాట్లాడుతూ… ఈరోజు నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు.ఇది నా మొదటి తెలుగు సినిమా.
ఒకప్పుడు తెలుగు తమిళ కన్నడ హిందీ సినిమాలు అనేవాళ్ళు ప్రస్తుతం ఇండియన్ సినిమా అని పిలవడం ఎంతో గర్వించదగ్గ విషయమని ఈయన తెలియజేశారు.సార్ వంటి అద్భుతమైన సినిమా కథలో నటించే అవకాశం నాకు కల్పించినందుకు డైరెక్టర్ వెంకీ అట్లూరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే సినిమా నిర్మాతలకు ఇతర చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రస్తుతం సార్ ట్రైలర్ వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను పెంచేసాయి.