సాధారణంగా కొందరికి ముఖంపై నలుపు లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతుంటాయి.అలాగే కొందరికి తెల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి.
ఏ మచ్చలైన సరే ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తాయి.దాంతో ఆయా మచ్చలను వదిలించుకోవడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.
మార్కెట్లో లభ్యమయ్యే రకరకాల క్రీములను కొనుగోలు చేసి వాడుతుంటారు.మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే ఇకపై అసలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే ముఖంపై ఎలాంటి మచ్చలున్న కొద్ది రోజుల్లోనే మాయం అవుతాయి.
అదే సమయంలో చర్మం బ్రైట్ గా సైతం మారుతుంది.
మరి ఇంతకీ ఆ పవర్ ఫుల్ రెమెడీ ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో అరకప్పు కడిగిన బియ్యాన్ని వేసి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత స్టైనర్ సహాయంతో రైస్ వాటర్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ రైస్ వాటర్ ను పూర్తిగా చల్లారబెట్టుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ములేటి పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి.చివరిగా సరిపడా రైస్ వాటర్ ను కూడా వేసి మరోసారి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి కనుక ఈ రెమెడీని పాటిస్తే ముఖంపై ఎలాంటి మచ్చలున్న సరే కొద్ది రోజుల్లోనే క్రమంగా దగ్గు ముఖం పడతాయి.పిగ్మెంటేషన్ సమస్య నుంచి సైతం ఈ రెమెడీ విముక్తి కలిగిస్తుంది.
క్లియర్ స్కిన్ ను మీ సొంతం చేస్తుంది. కాబట్టి మచ్చల సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హోమ్ మేడ్ పవర్ ఫుల్ రెమెడీని పాటించండి.
మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.