మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) హీరోగా వస్తున్న విశ్వంభర సినిమాలో( Vishwambhara ) కీలకమైన పాత్రలో త్రిష( Trisha ) నటిస్తుంది.ఇక తను ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాలు ఒకెత్తు అయితే ఈ సినిమాలో తను నటించే క్యారెక్టర్ మాత్రం సరి కొత్తగా ఉండబోతున్నట్టుగా తను తెలియజేస్తుంది.
నిజానికి ఆమె చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తూ మంచి విజయాన్ని అందుకుంటూ ముందుకు సాగాయి.కానీ ఇప్పుడు 40 సంవత్సరాల వయసులో కూడా తను ఇప్పుడు హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా పోటీని ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ ముందు దూసుకెళ్తుంది.
ఇక ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తుంది.ఇక దీంతో పాటుగా అజిత్ తో కూడా మరొక సినిమాలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది.అయితే ఈ సినిమాలో త్రిష ఒక దేవకన్య లాగా నటించబోతుందనే వార్తలు అయితే వస్తున్నాయి.ఇక ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి…ఇక దానికి తగ్గట్టుగానే చిరంజీవి గత చిత్రమైన బోళా శంకర్( Bhola Shankar ) సినిమా ప్లాప్ అవ్వడంతో ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ కొట్టాలని చూస్తున్నట్లు గా తెలుస్తోంది…
ఇక ప్రస్తుతం వశిష్ట( Vassishta ) ఈ సినిమాని సక్సెస్ చేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమాతోనే ఆయన సూపర్ సక్సెస్ కొడితే ఆయన పాన్ ఇండియా లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడు.ఇదిలా ఉంటే వశిష్ట ఇంతకుముందే బింబిసారా అనే భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు సినిమా మీద కూడా తన పూర్తి ఎఫర్ట్ అయితే పెడుతున్నట్టుగా తెలుస్తుంది… చూడాలి మరి ఈ సినిమాతో తను ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది…
.