ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!

వైసీపీ అధినేత సీఎం జగన్ ( CM Jagan ) శనివారం నెల్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ముస్లిం రిజర్వేషన్లపై( Muslim Reservations ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Cm Jagan Key Comments On Muslim Reservation Details, Ysrcp, Muslim Reservation,-TeluguStop.com

ఇటీవల బీజేపీ పార్టీకి( BJP ) చెందిన నేతలు ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటనలు చేయడం జరిగింది.ఈ క్రమంలో ఆరు నూరైనా ముస్లింలకు రిజర్వేషన్లు ఉంచాల్సిందేనని జగన్ తేల్చి చెప్పారు.

అంతేకాకుండా ముస్లిం రిజర్వేషన్లపై, ఎన్ఆర్సీ, సీఏఏ అంశాల్లో మైనారిటీలకు అండగా ఉంటామని జగన్ మాట ఇచ్చారు.చంద్రబాబు( Chandrababu ) ఓవైపు ఎన్డీఏలో కొనసాగుతూ మైనారిటీలపై దొంగ ప్రేమ కనబరుస్తున్నారని విమర్శించారు.

ముస్లిం రిజర్వేషన్ విషయంలో బీజేపీతో జతకట్టిన చంద్రబాబు ఎన్డీఏ( NDA ) నుంచి బయటకు రాగలరా.? అని ప్రశ్నించారు.మత ప్రాతిపదికన ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదని తెలిపారు.అన్ని మతాల్లోనూ బీసీలు, ఓసీలు ఉన్నారని చెప్పారు.ఈ రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రకారం వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చారని.సీఎం జగన్ గుర్తు చేశారు.

ఇలాంటి అంశాలలో ప్రజల జీవితాలతో చెలగాటమాడటం.మంచిది కాదని హెచ్చరించారు.

ఏపీలో ఎన్నికల దగ్గర పడుతూ ఉండటంతో వైయస్ జగన్.రోజుకి రెండు మూడు సభలలో పాల్గొంటున్నారు.శనివారం హిందూపురం, పలమనేరు, నెల్లూరులో పాల్గొనడం జరిగింది.2019 ఎన్నికల కంటే ఈసారి ఎన్నికలను.వైయస్ జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube