ఇటీవల కృష్ణమ్మ ( Krishnamma Movie ) అనే ఒక సినిమాకు సంబంధించిన ఫంక్షన్ ఒకటి జరిగింది దానికి అనిల్ రావిపూడి రాజమౌళి లాంటి పెద్దదర్శకులు అందరూ హాజరయ్యారు మాట్లాడుతూ మాట్లాడుతూ అనిల్ రావిపూడి( Anil Ravipudi ) నోరు పారేసుకున్నాడు అదేంటి అంటే ఐపీఎల్ మ్యాచ్లు( IPL Matches ) చూడకపోతే ఏమీ కాదు ఒకటి రెండు రోజులపాటు చూడకపోయినా నష్టం లేదు కానీ ఈ సినిమా ఖచ్చితంగా చూడండి అంటూ చెప్పుకొచ్చాడు ఈ కామెంట్స్ విన్న తర్వాత చాలామందికి అనిల్ రావిపూడి మాటలు నచ్చలేదు ఐపీఎల్ మ్యాచ్ లతో సినిమాలకు పోలిక ఏంటి.ప్రస్తుతం నెటిజన్స్ అంతా కూడా అనిల్ రావిపూడి మాటలకు ట్రోల్లింగ్ చేస్తున్నారు.
చేతిలో మైక్ ఉంటే సరిపోతుందా స్టేజ్ పై ఏది మాట్లాడాలో తెలియాల్సిన అవసరం లేదా అనేది నెటిజన్స్ అనిల్ రావిపూడి కి వేస్తున్న ప్రశ్న.సరే అనిల్ రావిపూడి మాటలు కాసేపు పక్కన పెడితే మొన్న ఈ మధ్యనే మరో సినిమా ఫంక్షన్ జరిగింది.సాయి ధన్సిక అనే నటి మెయిన్ లీడ్ గా నటించిన ప్రూఫ్( Proof Movie ) అనే సినిమాకి సంబంధించిన ఈవెంట్ దీనికి గెస్ట్ గా వచ్చినా దర్శకుడు మిష్కిన్( Director Mysskin ) ఏకంగా దేవుడితో సినిమాను పోల్చాడు.సినిమా అంటే దైవంతో సమానం.
కుటుంబంలో ఆరుగురు ఉంటే ఖచ్చితంగా ఒక ఐదుగురు సినిమా ప్రతి నెలలో ఒక్కసారైనా చూడాలి అంటూ ఏదో ఏదో వాగేశాడు.అసలు మ్యాచ్ లతో, దేవుడితో సినిమాకి ముడి పెట్టడం అంటే చూస్తే ఈ దర్శకులకు బుర్ర పని చేయడం లేదని క్లారిటీగా అర్థమవుతుంది.
ఆట చూడటంలో మజా ఉంది.దేవుడు దర్శనం చేసుకోవడానికి ఒక అర్థం ఉండాలి.వాటికీ సినిమాలకు( Movies ) పొంతన ఏంటి పిచ్చి స్క్రిప్ట్ పెట్టుకొని అర్థమైన సినిమాలు తీస్తే జనాలు చూడాలి అని దానికి మిగతా వాటిని చూడొద్దు అని చెప్పడానికి వీరికి ఏం అర్హత ఉంది.ఎంత స్క్రిప్ట్ ఆయన ఐపీఎల్ మ్యాచ్ చూడడంలో మజా ఉంటుంది.
మొత్తానికి ఇలా స్టేజి పైకి ఎక్కి దర్శకులంతా అబాసపాలవుతున్నారు ఇటీవల కాలంలో.అసలు థియేటర్స్ కి జనాలు ఎందుకు రావాలి? మీరు తీస్తున్న సినిమాల్లో అంత క్వాలిటీ ఏముంటుంది.మంచి సినిమా అయితే మనమే పరిగెత్తుకుని వెళ్లి చూస్తాం.మనకెవరు ఏది చూడాలి, ఏది చూడవద్దు అని చెప్పే హక్కు లేదు.