తన ఆరోగ్యం పై వీడియో విడుదల చేసి క్లారిటీ ఇచ్చిన కొడాలి నాని..!!

గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని( Kodali Nani) అనారోగ్యానికి గురైనట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.వైసీపీ నాయకులతో మాట్లాడుతుండగా కుప్పకూలిపోయారని.

 Kodali Nani Released A Video On His Health And Gave Clarity, Kodali Nani, Ysrcp-TeluguStop.com

వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేశారని తెగ ప్రచారం చేస్తున్నారు.దీంతో తన ఆరోగ్యం పై వస్తున్న వార్తలకు ఓ వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేసి కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు.

తన నివాసంలో సోఫాలో కూర్చుని సెల్ ఫోన్ చూస్తూ ఉన్న వీడియోని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడం జరిగింది.ఆ వీడియోలో ఆరోగ్యంగా శుభ్రంగా సోఫాలో కూర్చుని సేదతీరుతూ కనిపించడం జరిగింది.

దీంతో కొడాలి నాని ఆరోగ్యం పై వస్తున్నా వార్తలు అవాస్తవమని తేలింది.గతంలో కూడా ఈ రకంగానే.

ప్రచారం చేయగా కొడాలి నాని తీవ్రస్థాయిలో మీడియా సముఖంగా ఖండించారు.

కాగా ఇప్పటివరకు గుడివాడ నియోజకవర్గంలో( Gudivada Assembly constituency) నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కొడాలి నాని గెలవడం జరిగింది.ఈసారి కూడా గెలిస్తే మొత్తం ఐదుసార్లు అవుద్ది.ఈసారి ఎన్నికలను కొడాలి నాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ప్రచారంలో భారీ ఎత్తున పాల్గొని అన్ని వర్గాల ప్రజలను పలకరించారు.తెలుగుదేశం పార్టీ నుండి వెనిగండ్ల రాము( Venigandla Ramu ) పోటీ చేయటం జరిగింది.

ఇటీవల జరిగిన ఎన్నికలలో ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది.మరి గుడివాడ ప్రజలు ఎవరికి పట్టం కట్టారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube