' పిన్నెల్లి ' ఎక్కడున్నారు ? అరెస్ట్ అయ్యారా ?

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ( YCP MLA Pinnelli Ramakrishna Reddy )వ్యవహారం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం మిషన్ ను ధ్వంసం చేసినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ కావడం, ఆయనను అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

 Where Is 'pinnelli' Are You Arrested, Pinnelli Ramakrishnareddy , Macharl Mla, Y-TeluguStop.com

ఒకదశలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.అయితే ఆయన ను ఇప్పటివరకు అరెస్టు చేయలేదని తెలుస్తోంది.

దీంతో అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నారు అనేది అందరికీ ప్రశ్నగానే మారింది.మే 13వ తేదీన పోలింగ్ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లాలోని పాల్వాయి గేట్ లో పోలింగ్ స్టేషన్లోకి వెళ్లి అక్కడ ఈవీఎం ( EVM )ను నేలకేసి బద్దలు కొట్టారు.

అదే రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు వెంకటరామిరెడ్డి తో కలిసి హైదరాబాద్ కు వెళ్లారు.ఈ ఘటన పై పోలీసులు కేసులు నమోదు చేసి సైలెంట్ అయ్యారు.

Telugu Ap, India, Macharl Mla, Pinnelli, Ysrcp-Politics

ఈవీఎం మిషన్ ను ధ్వంసం చేసిన వీడియో బయటకు రావడంతో, ఎన్నికల సంఘం సీరియస్ అయింది.అయితే టిడిపి నేతలు రిగ్గింగ్ కు పాల్పడడంతోనే పిన్నెల్లి ఈవీఎం మిషాన్ ను ధ్వంసం చేశారని వైసిపి నేతలు( YCP leaders ) చెబుతున్నారు.పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు వెళ్లడంతో ఆయనను అరెస్టు చేసేందుకు బుధవారం పోలీసులు హైదరాబాద్ కు చేరుకున్నారు. కేపీ హెచ్ పీ( KPHP ) లోని ఇందు విల్లాస్ వద్దకు చేరుకున్న పోలీసులు కొద్దిసేపు అక్కడే ఉన్నారు.

ఆ తరువాత కొద్దిసేపటికి రామకృష్ణారెడ్డి కారు బయటకు రావడంతో, దానిని వెంబడించారు.

Telugu Ap, India, Macharl Mla, Pinnelli, Ysrcp-Politics

ఆ కారు 65 నెంబర్ జాతీయ రహదారిపై వేగంగా వెళ్లడంతో, సంగారెడ్డి పోలీసులను అప్రమత్తం చేశారు.అయితే పోలీసులకు దొరికిపోతామని భావించిన కారు డ్రైవర్ కారును పఠాన్ చెరువు దాటిన తర్వాత రుద్రారం వైపు మళ్ళించాడు.కొంత దూరం వెళ్ళిన తరువాత కారును ఆపారు.

వెనకాలే వెళ్లిన ఏపీ పోలీసులు కారులో ఉన్న డ్రైవర్, గన్ మెన్ ను అదుపులోకి తీసుకున్నారు.పిన్నెల్లి ఫోన్ తమకు ఇచ్చి డివైడర్ దాటి మరో వాహనంలో వెళ్లిపోయారని వారు చెప్పారట సోదరులు తమిళనాడు పారిపోయి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube