ఏందీ రవి తేజ మాకు ఈ పిసా పిసా.. నీ బాంచెన్ బాష ని చంపేశినవ్ కదా !

Ravi Teja Telangana Mass Dialogues In Walter Veeraiah , Ravi Teja, Telangana , Walter Veeraiah , Chiranjeevi , Lal Singh Chadha ,Salman Khan ,Allu Arjun ,Tanikela Bharani ,Siddu Jonnala Gaḍḍa

చేస్తుంది మెగా స్టార్ చిరంజీవి మూవీ.ఎవ్వడు వేలు పెట్టలేదు.

 Ravi Teja Telangana Mass Dialogues In Walter Veeraiah , Ravi Teja, Telangana ,-TeluguStop.com

ఏం చెప్పిన ముక్కు మూసుకొని చేయాలి.మొన్న లాల్ సింగ్ చద్దా అన్నాడు, నిన్న సల్మాన్ ఖాన్ విశేష పాత్ర అన్నాడు ఇప్పుడు మరొక నెత్తమాసిన పని.అదే రవి తేజ ను వాల్తేరు వీరయ్య కోసం తీసుకోచ్చారు.రవి తేజ అంటేనే ఒక కమర్షియల్ ఫార్ములా.

ఆ మధ్య అల్లు అర్జున్ అలా వైకుంఠపురం సినిమా కోసం కోడిని పట్టుకొని వచ్చినట్టు, ఇప్పుడే వదిలిన వాల్తేరు వీరయ్య సినిమా కోసం రవి తేజ మేక పిల్లను పట్టుకొని వచ్చాడు.ఇక ఈ టీజర్ చూసాక తెలంగాణ సమాజం ఏడవడం ఒకటే మిగిలింది.

ఇన్నాళ్లు రౌడీ లకు, సైడ్ క్యరెక్టర్ల కోసం వాడుకున్న తెలంగాణ ను ఇప్పుడు హీరోల చేత, తెలంగాణ బాష అంటే ఏంటో తెలియని వారి చేత కూడా పలికించి పక్కా కూలి చేయాలనీ డిసైడ్ అయ్యారు.తెలంగాణ లేనిదే ఇప్పుడు నడవదు.అందుకే రవి తేజ తో ఈ పిచ్చి ప్రయోగం చేయించారు.అంత బాగానే ఉంది కానీ ఆ యాస ఏందీ ఆ బాష ఏందీ అని తెలంగాణ వారు మొత్తుకుంటున్నారు.

కేవలం తెలంగాణ భాషను అదే యాస లో తనికెళ్ళ భరణి బాగా పలుకుతాడు.తెలంగాణ శకుంతల ని ఈ బాష తోనే పాపులర్ చేసారు.ఈ మధ్య సిద్దు జొన్నల గడ్డ కూడా బాగా మాట్లాడుతున్నాడు.

ఇలా మాట్లాడితే హిట్ అయ్యిందని ఎలా పడితే ఆలా చెప్తే వెనక్కి తిప్పి కొట్టడం కూడా తెలంగాణ వాళ్లకు బాగా తెలుసు.ఈ భాషను ప్రేమించే వాళ్ళు మాత్రమే చక్కగా మాట్లాడగలరు.కేవలం కమర్షియల్ సినిమాల కోసం ఇలాంటి వేషాలు వేస్తే అది కిచిడి అవుతుంది.

ఎలాగూ టీజర్ కోసం రెండు డైలాగ్స్ ప్రాక్టీస్ చేయించి చూపించారు అది ఇంకాస్త కష్టపడి యాస మీద పట్టు సాధించి చెప్తే బాగుండేది కదా. పిసా పిసా అంటూ చెప్పే ఈ డైలాగ్ ఎంత వరకు కరెక్ట్.పిస్స అంటారు తెలంగాణ వాళ్ళు.పిచ్చి అనే పదానికి ఇది వికృతి పదం.నేను ఎవ్వని అయ్యకు ఇననని చెప్పే ఈ డైలాగ్ చాల కృత్రిమంగా వచ్చింది, ఇకనైనా తెలంగాణ బాషా పేరు చెప్పుకొని సినిమాలను క్యాష్ చేసుకోవాలని అనుకుంటే బాష, యాస పైన కాస్త దృష్టి పెట్టండి.

Ravi Teja Mass Role in Waltair Veerayya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube